‘సూపరింటెండెంట్‌, ఏడీలను సస్పెండ్‌ చేయాలి’

ABN , First Publish Date - 2022-08-17T05:50:59+05:30 IST

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, ఏడీ రమేష్‌బాబులను సస్పెండ్‌ చేయాలని ఏఐవైఎఫ్‌, ఏఐఎ స్‌ఎఫ్‌, డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

‘సూపరింటెండెంట్‌, ఏడీలను సస్పెండ్‌ చేయాలి’

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 16: కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, ఏడీ రమేష్‌బాబులను సస్పెండ్‌ చేయాలని ఏఐవైఎఫ్‌, ఏఐఎ స్‌ఎఫ్‌, డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు,  జిల్లా కార్యదర్శి శ్రీరాములు, డీహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లను ఐదేళ్లకు మించి ఒకే చోట పని చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 120 మంది డాక్టర్లను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బదిలీ చేసిందన్నారు. గత 32 సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తూ సూపరిం టెండెంట్‌ నరేంద్రనాథ్‌ రెడ్డికి బదిలీ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్ర మంలో నాయకులు బాబయ్య, చంటి, చిన్న, శివరమేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్య క్షుడు సోమన్న, శరత్‌ కుమార్‌, ప్రతాప్‌, మునిస్వామి, అశోక్‌, వీర రామాం జినేయులు, చంద్ర, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T05:50:59+05:30 IST