Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Jul 2022 15:46:40 IST

Mahesh కు తండ్రిగా కన్నడ స్టార్ ?

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) నటించిన ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. బ్యాంక్‌ లోన్స్‌లోని అవకతవకలపై ఆసక్తికరమైన కథాకథనాలతో పరశురామ్ (Parasuram) ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేశ్ నటించబోయే సినిమాపైనే ఉంది అభిమానుల దృష్టి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా మహేశ్ 28వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. SSMB 28గా పిలుచుకుంటున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (S Radhakrishna) నిర్మించబోతున్నారు. అతడు (Athadu), ఖలేజా (Khaleja) చిత్రాల తర్వాత దాదాపు 12 ఏళ్ళకు మళ్ళీ మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇందులో నేచురల్ స్టార్ నానీ (Nani) నటించబోతున్నాడని వార్తలొచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని తేలడంతో.. తాజాగా మరో వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేశ్ తండ్రిగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) నటిస్తున్నారట. నిజానికి మహేశ్ కన్నా ఉపేంద్ర ఏడేళ్ళు మాత్రమే పెద్దవాడు. అలాంటప్పుడు అతడ్ని మహేశ్ తండ్రిగా ఎంపిక చేయడమేంటనే వాదన వినిపిస్తోంది. అయితే ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే కనిపిస్తుందని చెబుతున్నారు. 

ఇంతకు ముందు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (Son Of Satyamurthy) చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గా ఉపేంద్ర అద్భుతంగా నటించాడు. ఆయన భార్యగా స్నేహ (Sneha) నటించింది. తన తండ్రి ఆస్తికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని తేల్చుకోడానికి బన్నీ ఉపేంద్ర ఇంటికి వెళ్ళి.. చివరికి అతడిలో మార్పు తీసుకురావడం..  ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఉపేంద్ర త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనుండడం ఆసక్తి రేపుతోంది. మరి నిజంగానే ఉపేంద్ర మహేశ్ తండ్రిగా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement