గూగుల్‌ కెమెరాకు అప్డేట్‌

ABN , First Publish Date - 2022-07-02T08:57:54+05:30 IST

గూగుల్‌ ప్రత్యేకించి పిక్సల్‌ 6ఎ ని ఈ నెలాఖరులో తీసుకువస్తున్న నేపథ్యంలో అంతకుముందే ‘గూగుల్‌ కెమెరా యాప్‌’నకు అప్డేట్‌ని విడుదల చేసింది.

గూగుల్‌ కెమెరాకు అప్డేట్‌

గూగుల్‌ ప్రత్యేకించి పిక్సల్‌ 6ఎ ని ఈ నెలాఖరులో తీసుకువస్తున్న నేపథ్యంలో అంతకుముందే ‘గూగుల్‌ కెమెరా యాప్‌’నకు అప్డేట్‌ని విడుదల చేసింది. అయితే ఈ 8.5 వెర్షన్‌తో గుర్తించదగ్గ మార్పులు అంటూ ఏవీ చోటుచేసుకోవడం లేదు. డిజైన్‌ లేదంటే అవి చేసే పనిలో ఎలాంటి మార్పులు లేవు. రాబోయే 6ఎ స్మార్ట్‌ఫోన్‌కు అవసరమైన అప్‌గ్రేడ్స్‌ దీంతో కలుగనున్నాయని ‘9టు5గూగుల్‌’ వివరించింది. పిక్సల్‌ 6సిరీస్‌ మెయిన్‌ కెమెరా హార్డ్‌వేర్‌కు తోడు కంప్యూటింగ్‌ ప్రాయిస్‌ కోసం గూగుల్‌ టెన్సర్‌ చిప్‌నకు కలిపి ఈ అప్డేట్‌ ఉపయోగపడుతుంది. దీంతో పిక్సల్‌ 6ఎ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీ మెరుగుకానుంది. ఈ 8.5 వెర్షన్‌ ప్లేస్టోర్‌లో లభ్యమవుతోంది. గూగుల్‌ పిక్సల్‌ 5ఎ సహా మిడ్‌రేంజ్‌ డివై్‌సలు అన్నింటికీ ఈ వెర్షన్‌ విడుదలవుతోంది. నిజానికి 6, 6 ప్రొ రెంటికీ కెమెరాపరంగా ఇది అతి పెద్ద అప్‌గ్రేడ్‌. ఇమేజ్‌ క్వాలిటీ మెరుగుకానుంది. అలాగే రియల్‌ టోన్‌ అంటే సబ్జెక్టు స్కిన్‌ టోన్‌ రిఫ్లక్ట్‌ కావడానికి తోడు ఇతర టూల్స్‌ అంటే ‘సూపర్‌ రెస్‌ జూమ్‌’ ముఖ్యమైన ఫీచర్లు అని చెప్పవచ్చు. 

Updated Date - 2022-07-02T08:57:54+05:30 IST