Abn logo
Nov 27 2020 @ 12:08PM

`పుష్ప`లో అంత మంది విలన్లా?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ‌డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. రష్మిక హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలె చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది. 


ఈ సినిమాలో విలన్ల గురించి తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. `పుష్ప`లో ఏకంగా తొమ్మిది మంది విలన్లు ఉంటారట. మెయిన్ విలన్‌తోపాటు రావు రమేష్, ముఖేష్ రుషి వంటి మరికొందరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారట. అంతేకాదు `కలర్ ఫొటో`లో విలన్‌గా కనిపించిన కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో  కనిపించబోతున్నాడట. మరి, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement