మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పన్ కోషియమ్` తెలుగు రీమేక్‌కు అంతా రెడీ అయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాగర్ కె. చంద్ర డైరక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తూ తమన్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పవన్ భార్యగా సాయి పల్లవి, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. సుముద్రఖని, బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారట.