Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Jul 2022 17:46:29 IST

Upasana: ఉపాసన ప్రశ్న.. సద్గురు సమాధానం!

twitter-iconwatsapp-iconfb-icon

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సోషల్‌ మీడియా డెవలప్‌ అయ్యాక అది ఇంకాస్త పెరిగింది. అత్యుత్సాహం ఎక్కువైన కొందరు నెటిజన్లు జవాబు ఇచ్చిన కొద్దీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. అందులో రామ్‌రణ్‌–ఉపాసన దంపతులు ఒకరు. పెళ్లై పదేళ్లు అయినా ఇంకా పిల్లలు ఎందుకు లేరనే ప్రశ్న తరచూ   ఉపాసనను వెంటాడుతుంటుంది. ఈ ప్రశ్నకు ఎప్పుడూ స్పందించని ఉపాసన తాజాగా ఓ పెద్ద వేదిక మీద ప్రస్తావించారు. ఈషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. ఉపాసన మాట్లాడుతూ ‘‘ (Upasana question to sadguru)


‘‘నాకు పెళ్లై పదేళ్లయింది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. నేను అనుభవిస్తున్న జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎంతగానో పేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా రిలేషన్‌షిప్‌, రీప్రొడ్యూస్‌, రోల్‌ ఇన్‌ మై లైఫ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) గురించి అడుగుతుంటారు ఎందుకు?. ఈ సమస్య నా ఒక్కదానికే కాదు ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటున్నారు’ అని ఉపాసన సద్గురుని అడిగారు. ఆయన అందుకు సమాధానంగా ‘‘ ‘‘రిలేషన్‌పిష్‌ అనేది వ్యక్తిగత అంశం. కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. రీప్రొడక్షన్‌ విషయానికొస్తే..  పిల్లల్ని కనకుండా ఉంటే నేను అవార్డు ఇస్తా. ఆరోగ్యం, సంతాన సామర్థ్యంఉన్నా పిల్లల్నికనకూడదని నిర్ణయించుకున్న వారికి అవార్డు ఇస్తానని చాలాకాలం క్రితం ప్రకటించా. ఇప్పుడు పరిస్థితుల్లో పిల్లల్ని కనకపోవడమే మంచిది. గొప్ప సేవ చేసినట్లు కూడా. ఒకవేళ మీరు పులి అయితే సంతానాన్ని కనమని చెప్పేవాణ్ణి. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతోంది. వాటి అవసరం ఉంది మనకు. రాబోయే 30– 35 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరువయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నో మార్పులు చూడాల్సి ఉంటుంది. మనిషి మనుగడకు చోటు కూడా ఉండకపోవచ్చు. జనాభాను తగ్గించడం మన వల్ల సాధ్యపడుతుంది. బుర్రకు పని చెప్పకపోతే మన జననేంద్రియాలు చాలా ఉత్సాహంగా పనిచేస్తాయి. దీని వల్ల ఈ ప్రపంచంలోకి మరింత మంది మనుషుల అడుగులు పడతాయి. ఒక దశ దాటాక మనం కాలు కూడా కదపలేని పరిస్థితిని మనం చూడబోతున్నాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మరో మార్గంగా అవార్డులు ప్రదానం చేయడమే’’ అని సద్గురు తెలిపారు. Ramcharana-Sadhguru


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement