రెండు సింహాలను దత్తత తీసుకున్న ఉపాసన కొణిదెల

ప్రముఖ సినీనటుడు రాంచరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల శనివారం జూపార్కులోని 'విక్కీ', 'లక్ష్మీ' అనే రెండు ఏషియన్‌ సింహాలను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. అందుకు అవసరమైన 2 లక్షల రూపాయల చెక్కును క్యూరేటర్‌ రాజశేఖర్‌కు అందజేశారు. సోదరి అనుష్పల కామినేనితో కలిసి వచ్చిన ఆమె ముందుగా జూపార్కును తిలకించారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్‌ నాగమణి, పీఆర్‌ఓ హనీఫుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉపాసన అపోలో ఆసుపత్రికి సంబంధిచిన వ్యవహారాలను చూసుకుంటూనే సామాజసేవలోనూ పాల్గొంటున్నారు. 


Advertisement