‘ఉపాధి’లో కూలీలను పెంచండి

ABN , First Publish Date - 2022-05-24T04:57:51+05:30 IST

‘ఉపాధి’లో కూలీలను పెంచండి

‘ఉపాధి’లో కూలీలను పెంచండి
వీరబల్లి: మస్టర్లను పరిశీలిస్తున్న ఏపీడీ రవికుమార్‌

వీరబల్లి, మే 23: ప్రస్తుతం మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని ఏపీడీ రవికుమార్‌ సిబ్బందికి సూచించారు.  సోమవారం వీరబల్లి పంచాయతీలో  ఉపాధి పనులను ఆయన తనిఖీ చేశారు. మస్టర్‌ నమోదులో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేట్లను హెచ్చరించారు. రోజు కు కనీసం 5 గంటలు పనిచేస్తే కనీస వేతనం వస్తుందని సూచించారు. అనంతరం ఉపాధి కార్యాలయానికి విచ్చేసి ఉపాధి  సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఏపీవో నాగరాజు, ఈసీ సూర్యప్రకా్‌షరెడ్డి, ఉపాధి  సిబ్బంది పాల్గొన్నారు. 

రామాపురం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో నాణ్యత పెంచాలని ఏపీవో సురేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం మం డలంలోని కసిరెడ్డిగారిపల్లె, గోపగుడిపల్లె, గువ్వలచెరువు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీల హాజరుపట్టికను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రోజుకు రూ.255 కూలి అందేలా ప్రతి కూలీ పనిచేయాలన్నారు. మండల వ్యాప్తంగా 5,353 మంది కూలీలు పనిచేస్తున్నారన్నారు. పని కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే పనులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T04:57:51+05:30 IST