ధరణితో ఉపాధి పోయె..

ABN , First Publish Date - 2020-11-21T04:54:59+05:30 IST

ధరణితో ఉపాధి పోయె..

ధరణితో ఉపాధి పోయె..
షాద్‌నగర్‌లోని సబ్‌ రిజిష్ర్టార్‌ కార్యాలయం

డాక్యుమెంట్‌ రైటర్ల ఆవేదన 

కేసీఆర్‌ హామీపై ఆశలు

షాద్‌నగర్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో తాము ఉపాధి కోల్పోతున్నామని డాక్యుమెంట్‌ రైట ర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోన కారణంగా సబ్‌-రిజిష్ర్టార్‌ కా ర్యాలయాల బంద్‌తో ఇప్పటికే తాము కొన్ని నెలల పాటు పైసా ఆదాయం లేక ఆర్థిక ఇబ్బంది పడ్డామని, తీరా ఇప్పుడు ధరణి పో ర్టల్‌తో వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు కార్యాలయాల్లోనే అవుతు ండటంతో శాశ్వతంగా ఉపాధి కోల్పోతున్నామని అంటున్నారు. 1960 నుంచి డాక్యుమెంట్‌ రైటర్‌ వ్యవస్థ ఉందని, అప్పట్లో ప్రభుత్వమే ప రీక్ష నిర్వహించి, కొందరికి శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేసిందని గు ర్తు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2001 ఫిబ్రవరి 21న డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను రద్దు చేసినా... నేటి వ రకు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా తాము పనిచేస్తున్నా మని గుర్తుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ధరణి వె బ్‌సైట్‌లో తమకు ఎలాంటి ఆవకాశం ఇవ్వకుండా డాక్యుమెంటేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో నేరుగాగాని, మీసేవ కేంద్రాల్లో గానీ వివరాలను పొందుపర్చుకుని రిజిస్ట్రేషన్‌కు వెళ్లేలా చేయడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని అన్నారు. అయితే ధరణి వేబ్‌సైట్‌ ప్రారంభంతో డాక్యుమెంట్‌ రైటర్లను తిరిగి కొనసాగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమ ంత్రి కేసీఆర్‌ చెప్పినా నేటి వరకు తమ గురించి పట్టించుకోవడం లే దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు త మకు అవకాశం ఇవ్వాలని డాక్యుమెంట్‌ రైటర్లు కోరుతున్నారు.


మమ్మల్ని డాక్యుమెంట్‌ రైటర్లుగా కొనసాగించాలి


అరవై ఏళ్ల నుంచి ఉన్న డాక్యుమెంట్‌ రైటర్ల వ్య వస్థను రద్దు చేయవద్దు. ప్రజలు కొంటున్న ఆస్తుల కు మేం డాక్యుమెంట్లు తయారుచేస్తున్నాం. ఆన్‌లై న్‌ విధానం మంచిదే అయినా తెలియని వారు ఇ బ్బందులు పడే అవకాశం ఉంది. మాకు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని డాక్యుమెంట్‌ రైటర్లుగా నియమించాలి.

-  కె.వెంకటయ్య, దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, షాద్‌నగర్‌ 

Updated Date - 2020-11-21T04:54:59+05:30 IST