ఉపాధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-22T06:03:46+05:30 IST

నేషనల్‌ లైవ్‌లీహుడ్‌లో భాగంగా రొద్దం మండలంలో జరిగిన ఉపాధిహామీ పనులను తమిళనాడు గాంధీగ్రాం యూనివర్సిటీ ప్రొఫెసర్లు గురువారం పరిశీలించారు.

ఉపాధి పనుల పరిశీలన

రొద్దం, అక్టోబరు 21: నేషనల్‌ లైవ్‌లీహుడ్‌లో భాగంగా రొద్దం మండలంలో జరిగిన ఉపాధిహామీ పనులను తమిళనాడు గాంధీగ్రాం యూనివర్సిటీ ప్రొఫెసర్లు గురువారం పరిశీలించారు. మండల పరిధిలోని తురకలాపట్నం, సానిపల్లి చిన్నమంతూరు గ్రామాల్లో ఉపాధిహామీకింద జరిగిన వివిధ రకాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల పనితీరుపై ఆరాతీశారు. తురకలాపట్నం గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద రైతు రాంగోపాల్‌కు మంజూరైన మల్బరీ పంటను పరిశీలించారు. ఉపాధిహామీ పనులతో ఎలా లబ్ధిపొందారు..? ఆదాయం ఎంత వస్తుంది..? గ్రామానికి ఏమైనా సహాయపడుతున్నావా..? అంటూ ప్రొఫెసర్లు కవిత, తాహీర రైతును  ప్రశ్నించారు. అదేవిధంగా గ్రామ సచివాలయం నిర్మాణ పనులు, రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను పరిశీలించారు. గ్రామైఖ్య సంఘం సభ్యులతో మమేకమై బ్యాంకుల నుంచి రుణం ఎలా పొందుతున్నారు..? ప్రభుత్వం పథకాలతో ఎలా లబ్ధిపొందుతున్నారు..? తదితర వివరాలను ఆరాతీశారు. ప్రొఫెసర్ల వెంట డీడబ్ల్యుఎంఏ అడిషనల్‌ పీడీ విజయేంద్రప్రసాద్‌, ఏపీడీ రఘునాథ్‌రెడ్డి, హైసింగ్‌ డీఈ నాగరాజు, తహసీల్దార్‌ అనంతచారి, ఐకేపీ ఏపీడీ ఈశ్వరయ్య, వ్యవసాయాధికారిని నివేదిత, జేఈలు వహాబ్‌, ఖాజామెయినుద్దీన, ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన, టీఏలు సుందర్‌రాజు, ప్రకాశ, జేఈ ఓబుళపతి, ఎంఈఓ ఆంజనేయులునాయక్‌, సర్పంచులు లక్ష్మీదేవి, సానిపల్లి పరమేశ, మాజీ సర్పంచ రాము, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమేష్‌, కలిపి శేషు, ఏపీఓలు సుజాత జగదీశ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T06:03:46+05:30 IST