‘ఉపాధి’ బిల్లులేవీ?

ABN , First Publish Date - 2021-07-23T08:43:01+05:30 IST

ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను ఈ నెలాఖరు నాటికి చెల్లించే పరిస్థితులు ఆర్థికశాఖలో కనిపించడం లేదు. మొత్తం రూ.2,500 కోట్ల .

‘ఉపాధి’ బిల్లులేవీ?

90 శాతం పీఆర్‌ కమిషనరేట్‌లోనే

జిల్లాల నుంచి రావాల్సినవి 10 శాతం 

సీఎ్‌ఫఎంఎస్‌లో ఉన్నవి నామమాత్రమే

నెలాఖరుకి వాటిని చెల్లిస్తే సరిపోతుంది

హైకోర్టు తీర్పుపై ఆర్థిక శాఖ వైఖరి ఇదీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను ఈ నెలాఖరు నాటికి చెల్లించే పరిస్థితులు ఆర్థికశాఖలో కనిపించడం లేదు. మొత్తం రూ.2,500 కోట్ల బిల్లులన్నీ నెలాఖరు నాటికి చెల్లించాలని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, ఈ బిల్లులన్నీ సీఎ్‌ఫఎంఎ్‌సలో పెండింగ్‌లో ఉంటేనే ఆర్థికశాఖ చెల్లిస్తుంది. కానీ వాటిలో 90 శాతం ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌(ఎ్‌ఫటీవో)ల రూపంలో పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉండగా, మరో 10శాతం జిల్లాల నుంచి రావాల్సి ఉంది. వచ్చిన ఎఫ్‌టీఓలను కమిషనరేట్‌ అధికారులు సీఎ్‌ఫఎంఎ్‌సలో బిల్లుల రూపంలో అప్‌లోడ్‌ చేయాలి. కానీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు వీటిని కమిషనరేట్‌లో ఆపేశారు. అదేమంటే కోర్టులో ఉందని, విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, కొందరు పనిచేయకుండా బిల్లులు పెట్టారని... అవన్నీ తేలాలంటూ నాన్చుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ బిల్లులను ఆలస్యం చేయడానికి విజిలెన్స్‌ విచారణ వేశారని, అదీ అన్ని బిల్లులపై ఒకేసారి కాకుండా పలు దఫాలుగా వేసి ఆలస్యం చేశారని వాపోతున్నారు. కరోనా కారణంగా విచారణ చేయలేకపోతున్నామంటూ మరి కొన్నినెలలు సాగతీశారని చెబుతున్నారు. ఇప్పుడు అన్నీ పూర్తయి, కోర్టు తీర్పు వచ్చాక కూడా కమిషనరేట్‌ అధికారులు ఇంకా ఎఫ్‌టీఓలను సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్‌ చేయలేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎ్‌ఫఎంఎ్‌సలో నామమాత్రంగా ఉన్న ఉపాధి బిల్లులకు మాత్రమే చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-07-23T08:43:01+05:30 IST