నేను పార్వతిని.. శివుణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్న మహిళ.. అక్కడ నుంచి ఆమెను వెనక్కి పంపలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు!

ABN , First Publish Date - 2022-06-05T01:47:23+05:30 IST

అది భారత్ చైనా సరిహద్దు ప్రాంతం. అధికారుల అనుమతి ఉంటే తప్ప అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఓ మహిళ.. 15రోజులపాటు ఆ ప్రదేశంలో గడిపేందుకు అధికారుల అనుమతి తీసుకుని వెళ్లింది.

నేను పార్వతిని.. శివుణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్న మహిళ.. అక్కడ నుంచి ఆమెను వెనక్కి పంపలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు!

ఇంటర్నెట్ డెస్క్: అది భారత్ చైనా సరిహద్దు ప్రాంతం. అధికారుల అనుమతి ఉంటే తప్ప అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఓ మహిళ.. 15రోజులపాటు ఆ ప్రదేశంలో గడిపేందుకు అధికారుల అనుమతి తీసుకుని వెళ్లింది. గడువు ముగిశాక అక్కడి నుంచి రావడానికి నిరాకరిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే.. వింత సమాధానం చెబుతోంది. ‘నేను పార్వతిని. శివుణ్ణి పెళ్లి చేసుకుంటా’ అంటూ వాదిస్తోంది. ఆమె వైఖరితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


నాభిధాంగ్(Nabhidhang) అనే ప్రాంతం భారత్-చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఆంక్షలు అమలవుతూ ఉంటాయి. కాగా.. లక్నోకు చెందిన హర్మీందర్ కౌర్ అనే మహిళ.. ఉత్తరాఖండ్‌లోని గుంజీ అనే ప్రదేశాన్ని సందర్శించి.. అక్కడ 15రోజులపాటు గడిపేందుకు అధికారుల అనుమతి తీసుకుంది. ఆ గడవు గత నెల 25తో ముగిసిపోయింది. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా ఆమె ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేందుకు నిరాకరిస్తోంది. గుంజీ దగ్గర్లో ఉన్న నాభిధాంగ్ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ అక్కడి నుంచి కదలడం లేదు. ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే.. వింత సమాధానం చెబుతోంది. 



‘నేను పార్వతిని. కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడు. ఆయన్ను పెళ్లి చేసుకుంటా. మీరు నన్ను బలవంతంగా ఇక్కడ నుంచి పంపాలని ప్రయత్నిస్తే మాత్రం.. ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ బెదిరింపులకు దిగుతోంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా.. ఈ వ్యవహారంపై స్థానిక ఎస్పీ స్పందించారు. ఎక్కువ సంఖ్యలో అధికారులను అక్కడకు పంపి.. ఆమెను ఆ ప్రదేశం నుంచి బయటికి తీసుకురానున్నట్టు వెల్లడించారు. కాగా.. భక్తులు కైలాస-మనోసరోవర్ వెళ్లే  మార్గంలో గుంజీ ఉంటుంది. 


Updated Date - 2022-06-05T01:47:23+05:30 IST