Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 21 Apr 2022 16:43:20 IST

ఎదురుగా 50 టన్నుల చెత్త.. ఓ కవర్‌ కోసం అక్కాచెల్లెళ్ల వెతుకులాట.. ఇంతకీ అందులో ఏముందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
ఎదురుగా 50 టన్నుల చెత్త.. ఓ కవర్‌ కోసం అక్కాచెల్లెళ్ల వెతుకులాట.. ఇంతకీ అందులో ఏముందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చారు. ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో నివసిస్తూ చదువు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ 50 టన్నుల చెత్తను జల్లెడ పట్టాల్సి వచ్చింది. చివరికి వారిని విజయం వరించింది. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన రుచి, అనుష్క అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నత చదువుల కోసం తమ స్వగ్రామాని వీడారు. ఆగ్రా జిల్లాలోని నాగ్లా హవేలీ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో నివసిస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. రుచి ప్రస్తుతం బీఈడీ చేస్తుండగా.. అనుష్క బీఎస్సీ చదువుతోంది. ఎప్పటిలాగే ఉదయం నిద్రలేచిన రుచి.. తన చెవికి ఉన్న బంగారు ఆభరణాలను ఓ కవర్‌లో భద్రపరిచి దాన్ని బెడ్‌పై ఉన్న పిల్లో కింద పెట్టింది. అనంతరం రెడీ అయి.. కాలేజీకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని అనుష్క.. పిల్లో కింద ఉన్న కవర్‌ను చెత్త సంచీలో వేసి, దాన్ని మున్సిపాలిటీ వాహనంలో పడేసింది. 


సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన రుచి.. పిల్లో కింద పెట్టిన కవర్ గురించి అడగడంతో అనుష్కకు అసలు విషయం తెలిసింది. దీంతో తాను చేసిన పొరపాటు గురించి అనుష్క తన సోదరికి చెప్పింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చెత్తను డంప్ చేసే ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న సుమారు 50 టన్నుల చెత్తలో.. తమ కవర్‌ను వెతకడం ప్రారంభించారు. సుమారు 6 గంటల తర్వాత ఎట్టకేలకు కవర్‌ను గుర్తించారు. అందులో బంగారు ఆభరణాలు కూడా ఉండటంతో ఊరిపి పీల్చుకున్నారు. వాటిని తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.