సగం వరకే బ్యాగులు

ABN , First Publish Date - 2021-04-17T05:43:48+05:30 IST

ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులు సగం వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఎదుర్కొనే గన్నీ బ్యాగుల కొరతను అధిగమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

సగం వరకే బ్యాగులు

 - జిల్లాలో 1.60 కోట్ల గన్నీ సంచులు అవసరం

- అందుబాటులో ఉన్నవి 80 లక్షలు మాత్రమే

- రేషన్‌ దుకాణాలు, మిల్లులలో సేకరణకు యత్నం

- ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభించడానికి ఏర్పాట్లు

జగిత్యాల, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులు సగం వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఎదుర్కొనే గన్నీ బ్యాగుల కొరతను అధిగమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత కారణంగా రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి రావాల్సిన గన్నీ బ్యాగుల దిగుమతి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత సీజన్‌కు జిల్లాలో 1.60కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రస్తుతం జిల్లాలో సుమారు 80 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 80 లక్షల గన్నీ బ్యాగులను సేకరించడంపై అధికారులు దృష్టి సారిం చారు. స్థానికంగా ఉన్న గన్నీ బ్యాగులను అధికారులు సేకరిస్తున్నారు. రేషన్‌ దుకాణాలు, రైస్‌ మిల్లులు, స్థానిక వ్యాపారుల వద్ద నుంచి సేకరించాలని భావిస్తున్నారు. 

7.73 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి

 జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 2,97,437 ఎకరాల్లో రైతులు వరి  సాగు చేస్తున్నారు. ఇందుకు 7.73 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయి. ఇందుకు 406 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయని అధికారులు నిర్ధారించారు. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. ఇందులో జగిత్యాల, మెట్‌పల్లి, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌లు ఈ నామ్‌ పరిధిలో పనిచేస్తున్నాయి. మరికొన్ని కేంద్రాలను డీసీఎంఎస్‌, సహకార శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ)ల ద్వారా ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారు 1.60 కోట్లు గన్నీ బ్యాగులు అవసరమవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 80 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు. 

రేషన్‌ దుకాణాలు, రైస్‌ మిల్లుల నుంచి సేకరణ

ఈ నెలలో రేషన్‌ దుకాణాల నుంచి కొన్ని గన్నీ బ్యాగులను వచ్చే నెలలో మరికొన్ని గన్నీ బ్యాగులను సేకరించడానికి ఏర్పాట్లు చేస్తు న్నారు. అదే విధంగా రా రైస్‌ మిల్లులు, రైస్‌ మిల్లుల నుంచి సైతం గన్నీ బ్యాగులను సేకరించాలని భావిస్తున్నారు. దీంతో సమస్యలను చాలా వరకు అధిగమిస్తామని అధికారులు ధీమాతో ఉన్నారు. జిల్లాలో వచ్చే వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరో పక్షం రోజుల నుంచి నెల రోజుల తదుపరి కొనుగోళ్లు ఊపందు కోనున్నాయి. ఈ క్రమంలో అవసరమైనన్ని గన్నీ బ్యాగులు అందు బాటులో ఉంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. లేని పక్షంలో ప్రత్యామ్నా య ఏర్పాట్లపై దృష్టి సారిస్తామని అధికారులు అంటున్నారు. గన్నీ బ్యాగుల కొరత ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది.  


గన్నీ బ్యాగుల సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు

- చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరాఫరా శాఖాధికారి, జగిత్యాల

ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో సుమారు 1.60కోట్ల గన్నీ బ్యాగులు  అవసరమని అంచనా వేశాం. ఇప్పటికే సుమారు 80 లక్షల గన్నీ బ్యాగు లు అందుబాటులో ఉన్నాయి. మరో 80 లక్షల గన్నీ బ్యాగులను అవసరమైన సమయాల్లో సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం.  ఎటువంటి సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.  




Updated Date - 2021-04-17T05:43:48+05:30 IST