23 వరకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-20T04:43:13+05:30 IST

ఈ నెల 23వ తేదీ నాటికల్లా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా ఆరోగ్య బోధ కులు ఆర్‌.వేణుగోపాల్‌ ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు.

23 వరకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
బీర్కూర్‌లో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

బీర్కూర్‌, అక్టోబరు 19: ఈ నెల 23వ తేదీ నాటికల్లా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా ఆరోగ్య బోధ కులు ఆర్‌.వేణుగోపాల్‌ ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేష న్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జిల్లా డీఎం హెచ్‌వో ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజ లకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారని ఆయన తెలిపా రు. బీర్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 1,926 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆరోగ్య సిబ్బంది, అధికారులు అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నారన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవా లని కోరారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ సమాజా న్ని కరోనా నుంచి కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌లు ఉండవని తెలిపారు. గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు రత్నం, సూపర్‌వైజర్‌ సాయమ్మ, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, రాయిల్‌ హుస్సేన్‌ తదితరులున్నారు.  
ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్‌
తాడ్వాయి: మండలంలోని నందివాడ, ఎర్రాపహాడ్‌, చిట్యాల గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ మంగళవారం వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రాపహాడ్‌ వైద్యాధికారి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరుగుతూ ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోని వారి పేర్లను నమోదు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాప, శ్యామల, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్‌లో..
బాన్సువాడ: బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో మంగ ళవారం సర్పంచ్‌ వెంకటరమణ దేశ్‌ముఖ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. గ్రామంలోని ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారందరికీ వ్యాక్సిన్‌ వేశారు. అదేవిధంగా పనికి వెళ్లిన వారికి కూడా పని చేసే చోటుకు వెళ్లి వైద్య సిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క రూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వందశాతం కొవిడ్‌ నిర్మూలనకు కృషి చేయాలని సర్పంచ్‌ రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ ఎం శోభ, సిబ్బంది పల్లవి, సత్తవ్య, అనురాధ, కవిత, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:43:13+05:30 IST