Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

UAE లో అలా చేస్తే.. కోటి రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు!

twitter-iconwatsapp-iconfb-icon
UAE లో అలా చేస్తే.. కోటి రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు!

అబుదాబి: గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. అందుకే ఆ దేశాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువ. ఇక యూఏఈలో క్రైమ్ రేటు కేవలం 15.23 శాతంగా ఉంటే.. సెఫ్టీ 84.77 శాతం. కనుక భద్రత పరంగా యూఏఈ చాలా సేఫ్ దేశంగా చెప్పొచ్చు. క్రైమ్ నియంత్రణలో ఎప్పుడూ ముందుండే యూఏఈ తాజాగా ఆన్‌లైన్ వేదికగా వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఎవరైన ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడినట్లు తేలితే రూ. కోటి జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

UAE లో అలా చేస్తే.. కోటి రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు!

ఐటీ క్రైమ్స్‌కు సంబంధించి ఫెడరల్ డిక్రీ లా నెం.5 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 16 ప్రకారం.. ఆన్‌లైన్ వేదికగా ఓ వ్యక్తి అవతలి వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడినా లేక బ్లాక్‌మెయిల్ చేసిన రెండేళ్ల జైలు శిక్షతో పాటు 2.5లక్షల దిర్హమ్స్(రూ.50లక్షలు) నుంచి 5లక్షల దిర్హమ్స్(సుమారు రూ. కోటి) జరిమానా ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. ఒకవేళ నేరం తీవ్రమైనదైతే జైలు శిక్ష 10 ఏళ్ల వరకు విధించే అవకాశం ఉందని పేర్కొంది.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.