అత్యాచార యత్నాన్ని అడ్డుకుందని...

ABN , First Publish Date - 2021-07-13T18:19:28+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం జరిగింది....

అత్యాచార యత్నాన్ని అడ్డుకుందని...

బాలికపై కీచకుడు కత్తితో దాడి 

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం జరిగింది. తనపై అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో కీచక యువకుడు కత్తితో బాలికపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియా జిల్లాలో వెలుగుచూసింది.బాలియాలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలికపై 23 ఏళ్ల యువకుడు వచ్చి అత్యాచార యత్నం చేయబోయాడు. బాలిక ప్రతిఘటించడంతో ఆమె చేతులు తాడుతో కట్టి, కత్తితో ఆమె ముఖంపై గాయపర్చాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


తీవ్రంగా గాయపడిన బాధిత బాలికను మెరుగైన వైద్యం కోసం వారణాసి ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలికకు తెలిసిన వాడేనని పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారి సంజయ్ యాదవ్ చెప్పారు. 


Updated Date - 2021-07-13T18:19:28+05:30 IST