Viral Video: ఈ టీచర్లేంటి ఇలా తయారయ్యారు.. వాళ్ల కంటికి విద్యార్థులు ఎలా కనిపిస్తున్నారు?

ABN , First Publish Date - 2022-07-29T15:27:47+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు టీచర్ల(Teachers) వైఖరి ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. టీచర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తు

Viral Video: ఈ టీచర్లేంటి ఇలా తయారయ్యారు.. వాళ్ల కంటికి విద్యార్థులు ఎలా కనిపిస్తున్నారు?

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు టీచర్ల(Teachers) వైఖరి ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. టీచర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు.. వీళ్ల కంటికి ఎలా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీచర్లపై నెటిజన్లకు ఎందుకు అంత కోపం అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 



వర్షాకాలం కావడంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవడం సహజం. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని మథుర జిల్లాలో కూడా వర్షాల(Rains) కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓ పాఠశాల ప్రాంగణంలోకి నీళ్లొచ్చాయి. అందులో చదువుతున్న విద్యార్థులు మాత్రం.. ఆ నీళ్లలో నడుచుకుంటూ స్కూల్‌(School)కు వెళ్లారు. కానీ అందులో పని చేస్తున్న టీచర్ మాత్రం.. ఆ నీటిలోంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే తన బుర్రకు పదును పెట్టింది. విద్యార్థులతో నీటిలో కుర్చీలు వేయించుకుంది. అనంతరం వాటిని విద్యార్థులు పట్టుకోగా.. కుర్చీల(Chairs)పై నడుచుకుంటూ స్కూల్‌లోకి వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మరో స్కూల్‌లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. తాపీగా కుర్చీలో కుర్చుని.. విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌(Viral) గా మారాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. సదరు టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ టీచర్లేంటి ఇలా తయారయ్యారు? వాళ్ల కంటికి పేద విద్యార్థులు.. పని మనుషుల్లా కనిపిస్తున్నారా?’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలు(Videos) అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్లను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 




Updated Date - 2022-07-29T15:27:47+05:30 IST