మళ్లీ అధికారమిస్తే యూపీని అమెరికాలా చేస్తాం: గడ్కరీ

ABN , First Publish Date - 2021-12-26T17:40:17+05:30 IST

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలోని అనేక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నో కొత్త రోడ్లు నిర్మించాం. యూపీలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుంది. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఏదేళ్లలో ఐదు లక్షల కోట్లు రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తాం..

మళ్లీ అధికారమిస్తే యూపీని అమెరికాలా చేస్తాం: గడ్కరీ

లఖ్‌నవూ: మరో మూడు నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లకు ఐదు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను అమెరికా రోడ్ల తరహాలో తీర్చి దిద్దుతామని, యూపీని అమెరికాలా మారుస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


‘‘భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలోని అనేక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నో కొత్త రోడ్లు నిర్మించాం. యూపీలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుంది. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఏదేళ్లలో ఐదు లక్షల కోట్లు రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తాం. యూపీ రోడ్లను అమెరికా రోడ్ల తరహాలో తీర్చిదిద్దుతాం’’ అని గడ్కరీ అన్నారు.

Updated Date - 2021-12-26T17:40:17+05:30 IST