Snake bite :పట్టుకున్న నాగుపామును బాలిక మెడలో వేసి ఆడిస్తూ వీడియో తీయించుకుంటుండగా...

ABN , First Publish Date - 2022-08-22T18:07:11+05:30 IST

ఓ వ్యక్తి పొరుగింట్లోకి వచ్చిన నాగుపామును పట్టుకొని పామును(Snake) ఆడిస్తూ ఊరిలో తిరుగుతుండగా...

Snake bite :పట్టుకున్న నాగుపామును బాలిక మెడలో వేసి ఆడిస్తూ వీడియో తీయించుకుంటుండగా...

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ వ్యక్తి పొరుగింట్లోకి వచ్చిన నాగుపామును పట్టుకొని పామును(Snake) ఆడిస్తూ ఊరిలో తిరుగుతుండగా... అది కాటు వేయడంతో (Snake bite)మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని షాజహాన్ పూర్ జిల్లాలో(Shahjahanpur district) వెలుగుచూసింది. షాజహాన్ పూర్ జిల్లాకు చెందిన దేవేంద్ర శర్మ పొరుగింట్లోకి నాగుపాము రావడంతో అతను వెళ్లి దాన్ని కర్ర సాయంతో పట్టుకున్నాడు. పట్టుకున్న పామును ఆడిస్తూ ఊరంతా తిరుగుతూ ఓ చిన్నారి పాప మెడలో దాన్ని వేసి వీడియో కూడా తీయించుకున్నాడు.


రెండు గంటలపాటు పామును ఆడించాక అది దేవేంద్ర శర్మను కరిచింది. అంతే పాముకాటుకు గురైన దేవేంద్రశర్మ ఆసుపత్రికి వెళ్లకుండా వనమూలికలు వాడాడు. అత్యంత విషపూరిత మైన పాము(highly venomous Snake)కాటుకు దేవేంద్ర శర్మ మరణించాడు. దేవేంద్ర శర్మ పామును ఆడిస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా(viral on social media) మారింది.

Updated Date - 2022-08-22T18:07:11+05:30 IST