బుల్డోజర్ (Bulldozer) మీద పెళ్లిమండపానికి వచ్చిన bridegroom

ABN , First Publish Date - 2022-06-20T01:41:16+05:30 IST

పెళ్లి అనగానే ఎవరి స్థాయిలో వారు కాస్తంత వెరైటీగా చేసుకోవాలనే అనుకుంటారు. రొటీన్‌కు..

బుల్డోజర్ (Bulldozer) మీద పెళ్లిమండపానికి వచ్చిన bridegroom

లక్నో: పెళ్లి అనగానే ఎవరి స్థాయిలో వారు కాస్తంత వెరైటీగా చేసుకోవాలనే అనుకుంటారు. రొటీన్‌కు భిన్నంగా ఓ యువకుడు తన పెళ్లిని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడువు పెళ్లిమండపానికి ''బుల్డోజర్‌'' (Buldozer)లో వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపం సందడిగా మారిపోయింది. వరుడుతో ఫోటోలు దిగడం కంటే బుల్డోజర్‌తో ఫోటోలు దిగేందుకు అతిథులు ఎగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ్‌పూర్-శంకర్‌పూర్ గ్రామంలో ఆదివారంనాడు ఈ పెళ్లి సందడి చోటుచేసుకుంది.


బుల్డోజర్‌ను పూర్తిగా పూలతో అలంకరించడంతో పాటు వరుడు స్వయంగా దానిని నడుపుకొంటూ వెళ్లడంతో ఊరివాళ్లంతా బ్రహ్మరథం పట్టారు. ''బుల్డోజర్ బాబా కీ జై'' అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ''నా పెళ్లి ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని అనుకున్నాను. వెంటనే బుల్డోజర్ ఐడియా వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఆలోచన అమల్లో పెట్టాను'' అంటూ పెళ్లికొడుకు కేరింతలు కొడుతూ చెప్పాడు. యూపీలో 'బుల్డోజర్' అనే మాట ఇటీవలకాలంలో హౌస్‌ హోల్డ్‌ నేమ్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - 2022-06-20T01:41:16+05:30 IST