UP Election Result 2022: యోగీ నియోజకవర్గంలో ఎస్పీకి షాక్.. అఖిలేష్ పోటీ చేసిన చోట తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2022-03-10T14:33:28+05:30 IST

గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.

UP Election Result 2022: యోగీ నియోజకవర్గంలో ఎస్పీకి షాక్.. అఖిలేష్ పోటీ చేసిన చోట తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..

గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థిగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ తన అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అదే విధంగా ఎస్పీ నుంచి సుభావతి శుక్లా పోటీ చేస్తున్నారు. ఆమె ఎస్పీ సీనియర్ నేత ఉపేంద్ర దత్ శుక్లా భార్య. 2020వ సంవత్సరంలో గుండెపోటుతో ఆయన చనిపోయారు. దీంతో ఆయన భార్యను ఈ ఎన్నికల్లో నిలబెట్టారు. సానుభూతి పవనాలు తమ పార్టీ అభ్యర్థికి మెరుగైన ఓట్లను తీసుకొస్తాయని అఖిలేష్ భావించారు కానీ.. ఆ పార్టీ కనీసం రెండో స్థానంలో కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. 


ఇక మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తాజా ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం ఈ నియోజకవర్గంలో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ భాగెల్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ అఖిలేష్ గెలుపు ఖాయమనే సర్వేలు కూడా చెప్పాయి.

Updated Date - 2022-03-10T14:33:28+05:30 IST