UP Election Result 2022: తలకిందులైన అంచనాలు.. ఇదే ట్రెండ్ కొనసాగితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి..

ABN , First Publish Date - 2022-03-10T15:51:54+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉంటుంది.. బీజేపీ, ఎస్పీ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది.. ఎవరు గెలిచినా అత్తెసరు మెజార్టీతో గెలుస్తారు. బీజేపీ గతంలో కంటే గణనీయంగా సీట్లు తగ్గుతాయి.. ఇవీ.. ఇప్పటి వరకు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన వివరాలు. మీడియాలో వచ్చిన వార్తలు.

UP Election Result 2022: తలకిందులైన అంచనాలు.. ఇదే ట్రెండ్ కొనసాగితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉంటుంది.. బీజేపీ, ఎస్పీ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది.. ఎవరు గెలిచినా అత్తెసరు మెజార్టీతో గెలుస్తారు. బీజేపీ గెలుపు ఖాయమే కానీ గతంలో కంటే గణనీయంగా సీట్లు తగ్గుతాయి.. మెజార్టీ కంటే కాస్త ఎక్కువ సీట్లు వస్తాయంతే.. ఇవీ ఇప్పటి వరకు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన వివరాలు. మీడియాలో వచ్చిన వార్తలు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనాభిప్రాయం మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నట్టుగా తాజా లెక్కలు కనిపిస్తున్నాయి. అందరి అంచనాలకు మించి అనూహ్య రీతిలో బీజేపీ దూసుకెళ్తోంది. అయితే ప్రత్యర్థి పార్టీలకు కూడా అందనంత దూరంలో బీజేపీ నెంబర్లు ఉండటం గమనార్హం. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 300 సీట్ల మార్కును దాటే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


ఉదయం 10 గంటల సమయానికి వచ్చిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 250 సీట్లలో ముందంజలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ 112 సీట్లలో ముందంజలో ఉంది. బీఎస్పీ 8 సీట్లలో కాంగ్రెస్ మరో 8 సీట్లలో ముందంజలో ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఇక ఇతరులు మరో 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇంకా 16 సీట్లలోని పరిస్థితి గురించి సమాచారం రావాల్సి ఉంది. మొత్తానికి ఈసారి కూడా బీజేపీ అనూహ్య రీతిలో అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేయడం ఖాయమని బీజేపీ నేతలు తేల్చిచెబుతున్నారు. 2017 సంవత్సరంలో బీజేపీకి ఉత్తర ప్రదేశ్‌లో 312 సీట్లు వచ్చాయి. మరి ఈ ఎన్నికల్లో ఆ టార్గెట్‌ను చేరుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. 

Updated Date - 2022-03-10T15:51:54+05:30 IST