మిషన్ యూపీని ప్రారంభించిన కాంగ్రెస్!

ABN , First Publish Date - 2021-08-09T11:42:59+05:30 IST

ఈ ఏడాదిలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో...

మిషన్ యూపీని ప్రారంభించిన కాంగ్రెస్!

లక్నో: ఈ ఏడాదిలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రదర్శనలు, నినాదాలకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు నూతన వ్యూహాలకు రూపకల్పన చేసింది. యోగీ సర్కారులోని లోపాలను ఎండగట్టేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. 


రాష్ట్రంలో పెరిగిన ధరలు, రైతుల ఆందోళన, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు కదులుతోంది. రాష్ట్రంలోని 403 నియోజక వర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేసేందుకు సిద్ధమయ్యింది. ‘బీజేపీ గద్దీ ఛోడో’ అనే నినాదంలో ఈ ప్రదర్శనలు నిర్వహించనుంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ రాష్ట్రంలోని రైతులను, మహిళలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వీటినే ఆయుధాలుగా మలచుకుని నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. 

Updated Date - 2021-08-09T11:42:59+05:30 IST