డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath ఐదేళ్ల విరామం తర్వాత తల్లిని కలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న యోగి పౌరి గర్హ్వాల్ జిల్లాలోని తన సొంతూరు పంచూరుకు వెళ్లారు. తన తల్లి సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. యోగి తన సొంతూరును 2017 ఫిబ్రవరిలో సందర్శించారు.
కోవిడ్ మహమ్మారి వేళ 2020 ఏప్రిల్‌లో తన తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ మరణించినా అంత్యక్రియలకు యోగి వెళ్లలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవడంతో తన తల్లి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన సొంతూరుకు వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన తన ఆధ్యాత్మిక గురువు మహంత్ ఆవైధ్యనాథ్ విగ్రహాన్ని యమ్‌కేశ్వర్‌లోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్ మహావిద్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.