యూపీ సీఎం యోగి నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవాలయాల పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య నగరంలోని రామాలయంతోపాటు ఇతర నగరాల్లోని దేవాలయాలు, ఇతర మత పుణ్యక్షేత్రాలపై పన్నులు విధించవద్దని నగర మున్సిపల్ కార్పొరేషన్లను సీఎం యోగి కోరారు. రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదిత్యనాథ్ అయోధ్య నగరాన్ని పర్యటించి శ్రీరామనవమి మేళా ఏర్పాట్లను సమీక్షించారు.అయోధ్యలో, ఆదిత్యనాథ్ హనుమాన్‌గర్హి ఆలయంలో కూడా ప్రార్థనలు చేశారు. రామ మందిర నిర్మాణ స్థలాన్ని సీఎం సందర్శించారు.అనంతరం బల్రామ్పూర్ జిల్లాను కూడా సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ మూడు ఆలయాల్లో పూజలు చేశారు.
అక్కడి దేవీ పటాన్ ఆలయంలో రాత్రి బస చేసి శనివారం సిద్ధార్థనగర్‌కు బయల్దేరారు.దేవాలయాలు,మత పుణ్యక్షేత్రాల నుంచి వాణిజ్య పన్ను తీసుకోవద్దని ఆదిత్యనాథ్ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ మఠాలు, దేవాలయాలు, ధర్మశాలలు, ధార్మిక సంస్థల నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, మురుగునీటి పన్నులను వాణిజ్య ధరల ప్రకారం వసూలు చేయకూడదని, ఈ సంస్థలన్నీ ప్రజాసేవ చేస్తున్నాయని సీఎం చెప్పారు. టోకెన్ ద్రవ్య విరాళాల రూపంలో మతపరమైన పుణ్యక్షేత్రాల నుంచి ఆర్థిక సహకారం మాత్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి పౌర సంస్థలను కోరారు.సీఎం తన పర్యటనలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, భక్తమాల్ సీనియర్ సీర్ మహంత్ కౌశల్ కిషోర్‌లను కలిశారు.
ఇవి కూడా చదవండి