హత్రాస్ బాధిత కుటుంబంతో సీఎం యోగి వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-10-01T00:19:33+05:30 IST

హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్

హత్రాస్ బాధిత కుటుంబంతో సీఎం యోగి వీడియో కాన్ఫరెన్స్

లక్నో : హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. సీఎంతో బాధితురాలి తండ్రి మాట్లాడారని అధికారులు ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేస్తామని ముఖ్యమంత్రి యోగి హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు. 

మరోవైపు బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 25 లక్షల నగదు, ఓ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఓ ఇంటిని కూడా మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-01T00:19:33+05:30 IST