కరోనా పరీక్షలపై సీఎం యోగి కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-14T03:44:07+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహరి రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో సీఎం యోగి అదిత్యనాథ్..

కరోనా పరీక్షలపై సీఎం యోగి కీలక నిర్ణయం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సీఎం యోగి అదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోజుకు 50 వేల చొప్పున కొవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలను రోజుకు 30 వేల వరకు పెంచవచ్చుననీ.. అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను రోజుకు 18 నుంచి 20 వేలకు పెంచే అవకాశం ఉందని సీఎం యోగి పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు యూపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,130కి చేరింది. వీరిలో 12,972మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 24,203 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 955 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-07-14T03:44:07+05:30 IST