Abn logo
Sep 26 2021 @ 19:05PM

యూపీ మంత్రివర్గ విస్తరణ..కొత్తగా ఏడుగురికి చోటు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురికి చోటు కల్పించారు. కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద్, మరో ఆరుగురు కొత్త మంత్రులుగా ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని గాంధీ భవన్‌లో 5.30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. జితిన్ ప్రసాదతో పాటు ఛత్రపాల్ సింగ్, పట్లు రామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేష్ ఖడిక్, ధర్మవీర్ ప్రజాపతి ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున మంత్రివర్గ విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

జాతీయంమరిన్ని...