Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 15 Jan 2022 17:17:04 IST

మిస్ బికినీ ఇండియా-2018కు కాంగ్రెస్ టిక్కెట్

twitter-iconwatsapp-iconfb-icon
మిస్ బికినీ ఇండియా-2018కు కాంగ్రెస్ టిక్కెట్

మీరట్: నటి, మిస్ బికనీ ఇండియా-2018 అర్చనా గౌతమ్‌కు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. మీరట్‌లోని పురాతన పవిత్ర నగరంగా పేరున్న హస్తినాపూర్ నుంచి అర్చన పోటీ చేయనున్నారు. ఆమె మిస్ బికినీ ఇండియా-2018 టైటిల్‌ గెలుచుకోవడంతో పాటు, 2014లో మిస్ ఉత్తరప్రదేశ్‌గా, 2018లో మిస్ కాస్మో వరల్డ్‌గా ఎన్నికయ్యారు. 2021 నవంబర్‌లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.


కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ కేటాయించడంపై అర్చనా గౌతమ్ మాట్లాడుతూ, హస్తినాపూర్ నుంచి తాను గెలిస్తే అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తానని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తానని చెప్పారు. హస్తినాపూర్ పర్యాటక స్థలమే కాకుండా, చాలా పురాతన ఆలయాలు ఉన్నాయని, కనెక్టివికీ సమస్య కారణంగా ఎక్కువ మంది ఇక్కడకు రాలేకపోతున్నారని అన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని, పర్యాటకులు పెరిగితే చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం కూడా తాను పాటుపడతానని చెప్పారు. ఏటా వరదలతో పంటలు దెబ్బతింటున్నాయని, రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు. ఇక్కడ ఒకటే చక్కెర మిల్లు ఉండటంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, మరిన్ని చక్కెర మిల్లులు తెరిపిస్తానని హామీ ఇచ్చారు. తన బికినీ ఫోటోలు వైరల్ కావడంపై అడిగినప్పుడు, మీడియా ఇండస్ట్రీలో వృత్తిని రాజకీయ కెరీర్‌తో ముడిపెట్టవద్దని కోరారు.


కాగా, మహిళలకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా సమాజంలోని వివిధ వర్గాల మహిళలకు కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయిస్తోంది. గత గురువారం 125 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించగా, వారిలో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 403 మంది సభ్యుల యూపీ అసెంబ్లీకి ఏడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 10,14,20, 23,27, మార్చి 3,7 తేదీల్లో ఈ పోలింగ్ ఉంటుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.