Abn logo
Apr 23 2021 @ 01:22AM

అకాలవర్షంతో పంటలకు నష్టం

జనగామ టౌన్‌, ఏప్రిల్‌ 22 : అకాలవర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా బుధవారం రాత్రి పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. జనగామ మండలంలో వరి, మామిడి రైతులకు తీవ్రనష్టం జరిగింది. మండలంలోని చౌడారంలో సిద్దిరాములు, యాదవరెడ్డి, తిరుమల్‌రెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురికి చెందిన 50 ఎకరాల్లో వరి నేలవాలింది. వడ్లు నేలరాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. పెద్దపహాడ్‌, మరిగడి గ్రామాల్లో వరి, మామిడి నేలా వాలాయి. గురువారం ఎంపీపీ కళింగరాజు, చౌడారం గ్రామంలో పర్యటించి వరి పంట, మామిడి తోటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  

 ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఏఈవో  


చిలుపూర్‌ : వడగళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఈవోలు బూర్ల నర్సింహులు, రమ్య తెలిపారు. మండలంలోని శ్రీపతిపల్లి, కొండాపూర్‌, లింగంపల్లి గ్రామాల్లో  నష్టపోయిన వరిని పరిశీలించారు. పంటలకు నష్టం వాటిల్లిందని ఏఈవోల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపతిపల్లి, కొండాపూర్‌, లింగంపల్లి గ్రామాల్లో సుమారు 15 వందల ఎకరాల్లో పంటలకు  నష్టం వాటిల్లినట్లు నిర్ధారించామని, నివేదికను త్వరలో ఉన్నాతాధికారులకు అందజేస్తామని ఏఈవోలు పేర్కొన్నారు. సర్పంచులు కేశిరెడ్డి ప్రత్యూష రెడ్డి, లోడెం రజిత, ఏదునూరి రవిందర్‌, సమ్మక్క జాతర కమిటీ చైర్మన్‌ మోతె శ్రీను, మాజీ సర్పంచులు కొయ్యడ రాందాస్‌, ఎలిశాల కనకయ్య, ఎల్లయ్య, గాలి రాజు, ప్రవీన్‌, కనకయ్య, తిరుపతి, రాజబాబు, రవి పాల్గొన్నారు.  

పరిశీలించిన రైతుసంఘం నేతలు


బచ్చన్నపేట : మండలంలోని ఇటుకాలపల్లి, రాంచంద్రాపూర్‌ గ్రామాల్లో నష్టపోయిన పంటలను తెలంగాణ రైతుసంఘం నేతలు  పరిశీలించారు. పంటల నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి, గొడుగు కనకయ్య, మల్లేశం, బీరయ్య, నరేష్‌, రాములు, అంజయ్య, బాలయ్య, చంద్రమౌళి, నాగరాజు పాల్గొన్నారు. 

శ్రీపతిపల్లిలో వడగళ్ళకు దెబ్బతిన్న వరిని పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు


కొండాపూర్‌లో నేలరాలిన వరిపంట


పంటలను పరిశీలిస్తున్న రైతుసంఘం నేతలు


Advertisement