అమెరికాలో 24ఏళ్ల NRI యువతి దారుణ హత్య.. 13ఏళ్లైనా వీడని మిస్టరీ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-26T06:32:46+05:30 IST

అమెరికా.. సకలవసతులకు నిలయం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఈ దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఏ నేరం జరిగినా.. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి

అమెరికాలో 24ఏళ్ల NRI యువతి దారుణ హత్య.. 13ఏళ్లైనా వీడని మిస్టరీ.. అసలేం జరిగిందంటే..

వాషింగ్టన్: అమెరికా.. సకలవసతులకు నిలయం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఈ దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఏ నేరం జరిగినా.. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి అక్కడి పోలీసులు దోషులను గుర్తిస్తూ ఉంటారు. ఇటువంటి అమెరికా పోలీసులకు.. 24ఏళ్ల ఎన్నారై యువతి కేసు సవాలు విసురుతోంది.  దాదాపు 13ఏళ్లుగా.. అమెరికా పోలీసులు దోషులను పట్టులేకపోతున్నారు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో మరోసారి చర్చనీయాంశం అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


భారత్‌కు చెందిన 24ఏళ్ల అర్పణా జినగా.. అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ సీటీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న.. అర్పణాకు బైక్ రైడింగ్ అంటే ప్రాణం. కాగా.. 2008 అక్టోబర్‌ 31న అపార్ట్‌మెంట్ కాంపెక్ల్స్‌లో జరిగిన ఓ పార్టీలో.. సాధరణంగా బైక్ రైడర్లు ధరించే దుస్తులతో ఆమె తళుక్కుమంది. ఎంతో హుషారుగా పార్టీలో పాల్గొంది. అయితే అర్పణాకు అదే చివరి పార్టీగా మిగిలిపోయింది. 2008, నవంబర్ 1 తేదీ తెల్లవారు జామున అర్పణా ఘోరాతిఘోరంగా హత్యకు గురైంది. అక్టోబర్ 31 తర్వాత అర్పణా ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అమెరికాలో ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కు సమాచారం ఇచ్చారు.



 ఈ క్రమంలో నవంబర్ 3న ఓ ఫ్యామిలీ ఫ్రెండ్.. అర్పణా అపార్ట్‌మెంట్‌కు చేరుకోవడంతో దారుణం బయటపడింది. తలుపులు బద్దలు కొట్టి.. ఇంట్లోకి ప్రవేశించిన సదరు ఫ్యామిలీ ఫ్రెండ్.. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కుళ్లిన స్థితిలో ఉన్న అర్పణా మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అర్పణా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. పోర్ట్‌మార్టం చేయించారు. అర్పణాపై అత్యాచారం జరిగినట్టు శవపరీక్షలో నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇమ్మాన్యూయల్ ఫేర్ అనే వ్యక్తిని 2010లో అరెస్ట్ చేశారు. అయితే కోర్టు అతన్ని నిర్ధోషిగా తేల్చింది. దీంతో ఇమ్మాన్యూయల్ 2019, జూన్ 11న జైలు నుంచి విడుదలయ్యాడు. 


అర్పణా.. హత్యకు గురై 13ఏళ్లు గడుస్తున్నా.. దోషి ఎవరన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్.. అర్పణాకేసుపై దృష్టి సారించారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ విడతల వారీగా వాటిని ప్రసారం చేస్తున్నారు. తాజాగా పార్టీ జరిగిన రాత్రి ఏం జరిగిందన్న అంశంపై అపార్ట్‌మెంట్‌లోని అర్పణా ఇరుగుపోరుగు వారిని ఇంటర్యూ చేసి, దాన్ని ప్రసారం చేశారు. దీంతో మరోసారి అమెరికాలో అర్పణా హత్యకేసు హాట్‌టాపిక్‌గా మారింది. 




Updated Date - 2021-08-26T06:32:46+05:30 IST