తెలుగు రాష్ట్రాల మధ్య తేలని పంచాయితీ!

ABN , First Publish Date - 2021-04-08T08:52:31+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తుల పంపకంపై చర్చలు జరుగుతున్నా పరిష్కారం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య తేలని పంచాయితీ!

  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో
  • ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీ


అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తుల పంపకంపై చర్చలు జరుగుతున్నా పరిష్కారం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్‌ భార్గవ, అనంతరాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన రూ.4,800 కోట్ల బకాయి అంశం చర్చకు వచ్చింది. అయితే, ఈ అంశంపై చర్చను తెలంగాణ దాటవేసింది. ఇక, డీఎస్పీలు, అడిషనల్‌ ఎస్పీలు(సివిల్‌), నాన్‌ క్యాడర్‌ ఎస్పీ, షెడ్యూల్‌ 9లోని ఆస్తులు, సింగరేణి కాలరీ్‌సలో ఏపీవాటా, విభజన చట్టంలోని 50, 51, 56 ప్రకారం టాక్సేషన్‌ ప్రొవిజన్స్‌పై చర్చించారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏపీకి తరలించడం.. విద్యుత్‌ బకాయిల చెల్లింపు అంశాలు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తావనకు వచ్చాయి.

Updated Date - 2021-04-08T08:52:31+05:30 IST