- జీతాలు, పెన్షన్లలో కోత పెట్టక తప్పదు.. కేంద్రం ఆందోళన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొట్టేస్తే ఉద్యోగుల్లో అశాంతి ప్రబలే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభు త్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు అఫిడవిట్ సమర్పించింది. తమ విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించకపోతే ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని, దాంతో కొంత మంది ఉద్యోగులకు రివర్షన్ ఇవ్వాల్సి వస్తుందని, వేతనాలను, పెన్షన్లను తిరిగి ఖరారు చేయాల్సి ఉంటుందని, అదనంగా జీతాలు, పెన్షన్లు పొందిన వారి నుంచి రికవరీ చేయాల్సి ఉంటుందని వివరించింది. దీనివల్ల అనేక న్యాయవివాదాలు పుట్టుకొస్తాయన్నది. ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీల వాటా ఇప్పటికీ తగినంతగా లేదని, రిజర్వేషన్లు ఇచ్చినా పరిపాలనకు ఆటంకాలు ఉండవని చెప్పింది.