అనధికార లే అవుట్లపై కొరడా

ABN , First Publish Date - 2022-05-29T06:02:41+05:30 IST

అనధికార లే అవుట్లపై కొరడా

అనధికార లే అవుట్లపై కొరడా
లేఅవుట్‌లో జెండాలను తొలగిస్తున్న అధికారులు

కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరులో తొలగింపు 

అనుమతి లేకుండా దొంగ లే అవుట్‌ నెంబర్లు 

బోర్డులు, రాళ్లు, రోడ్లు తొలగించిన సీఆర్‌డీఏ అధికారులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అనధికార లే అవుట్లపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కొరడా ఝళిపించింది. కృష్ణాజిల్లా పరిధిలో 65వ నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి పలు మండలాల పరిధిలో సీఆర్‌డీఏ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లకు సంబంధించిన పక్కా సమాచారం అందటంతో శనివారం ఈ దాడులు చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశాలతో పట్టణ ప్రణాళికా విభాగం కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల పరిధిలో ఏకకాలంలో ఈ దాడులు చేసింది. కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరు, దావులూరు వెంచర్లతో పాటు ఉయ్యూరు మండల పరిధిలోని గండిగుంట, తోట్లవల్లూరు మండల పరిధిలోని యాకమూరులోని వెంచర్లను తొలగించారు. సీఆర్‌డీఏ అనుమతులు లేనప్పటికీ, ఉన్నట్టుగా బోర్డులు పెట్టి, రాళ్లను ఏర్పాటుచేయగా, వాటిని అధికారులు తొలగించారు. రోడ్లను ఎక్స్‌కవేటర్లతో తవ్వేశారు. అనధికార వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు జరగకుండా ఉండటం కోసం రిజిస్ర్టేషన్‌ అథారిటీ, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లాన్‌ (డీటీసీపీ)కి కూడా సమాచారం ఇచ్చారు.

Updated Date - 2022-05-29T06:02:41+05:30 IST