వృద్ధి 7.5శాతం

ABN , First Publish Date - 2021-05-12T06:24:06+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో వివిధ రేటింగ్‌ సంస్థలు భారత వృద్ధిరేటును భారీగా కుదిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి 2021 సంవత్సరానికి వృద్ధిరేటు 7.5 శాతానికే పరిమితం...

వృద్ధి 7.5శాతం

  • ఐక్యరాజ్య సమితి అంచనా

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో వివిధ రేటింగ్‌ సంస్థలు భారత వృద్ధిరేటును భారీగా కుదిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి 2021 సంవత్సరానికి వృద్ధిరేటు 7.5 శాతానికే పరిమితం కావచ్చునని ప్రకటించింది. కరోనా సంక్షోభానికి భారత్‌ హాట్‌స్పాట్‌గా మారిన నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి అవకాశాలు బాగా సన్నగిల్లాయని తాజా నివేదికలో పేర్కొంది. అయితే  2022లో వృద్ధి రేటు 10.1 శాతానికి చేరుకోవచ్చని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించనుందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాను 9.3 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ తెలిపింది. గతంలో వృద్ధి రేటును 13.7 శాతంగా అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను సైతం గతంలో పేర్కొన్న 7.9 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. 2021-22 వృద్ధి అంచనాను 12.6 శాతం నుంచి 10.8 శాతానికి కుదిస్తున్నట్లు నోమురా ప్రకటించింది. కరోనా పూర్వ దశతో పోలిస్తే, మే 9తో ముగిసిన వారానికి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు 64.5 శాతానికి తగ్గాయని నోమురా తెలిపింది. ఇది 2020 జూన్‌లో నమోదైన కార్యకలాపాల రేటుతో సమానమని రిపోర్టులో పేర్కొంది. కేర్‌ రేటింగ్స్‌ సైతం 2021-22 జీడీపీ వృద్ధి అంచనాను 10.2 శాతం నుంచి 9..2 శాతానికి తగ్గించింది. 


Updated Date - 2021-05-12T06:24:06+05:30 IST