ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉన్నావ్ అత్యాచార ఘటన. ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికపై 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తల్లి ఆశా సింగ్ తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది.
ఆ ఘటన రాష్ట్రాన్ని కలచివేసినా.. దేశవ్యాప్తంగా కలకలం రేపినా.. తాజా ఎన్నికల్లో మాత్రం స్థానిక ప్రజలు ఆ కుటుంబానికి మద్దుతుగా నిలవలేదు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఉన్నావ్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన ఆశా సింగ్‌కు కేవలం 250 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పంకజ్ గుప్తా 23448 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు.