లైసెన్స్‌ లేని వ్యాపారాలు

ABN , First Publish Date - 2020-12-03T05:17:52+05:30 IST

చట్ట బద్ధంగా ఏ వ్యాపారం నిర్వ హించాలన్న ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రతియేటా క్రమంతప్పకుండా వ్యాపార లైసెన్స్‌ ను రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో అనేకమంది వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని రెన్యూవల్‌ చేయించుకోకుండానే వ్యాపారం చేస్తున్నారు.

లైసెన్స్‌ లేని వ్యాపారాలు
కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం..

కామారెడ్డి మున్సిపాలిటీలో లైసెన్స్‌ రెన్యూవల్‌పై వ్యాపారుల నిర్లిప్తత

ఏళ్లుగా కట్టని ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజు బకాయిలు 

వసూళ్లకు మూడు బృందాల ఏర్పాటు

కామారెడ్డి, డిసెంబరు 2: చట్ట బద్ధంగా ఏ వ్యాపారం నిర్వ హించాలన్న ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రతియేటా క్రమంతప్పకుండా వ్యాపార లైసెన్స్‌ ను రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో అనేకమంది వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని రెన్యూవల్‌ చేయించుకోకుండానే వ్యాపారం చేస్తున్నారు. మున్సిపాలిటీకి ప్రతియేటా ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లించ కుండా ఎగనామం పెడుతున్నారు. దశాబ్ధకాలంగా లైసెన్స్‌ ఫీజు బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి. ప్ర స్తుతం వీటి వసూళ్లపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జా హ్నవి రెండు నెలల కిందట నుంచి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ట్రెడ్‌లైసెన్స్‌ తీసుకునే వారికి గడువు ఇవ్వాల ని, గడువు ఇచ్చినా కట్టని వారిపై కఠినంగా వ్యవహరించి, లైసెన్స్‌లు రద్దు చేయాలని మున్సిపల్‌ అధికారులకు పలు మార్లు సూచించింది. మూడు బ్లాక్‌లుగా చేసి ప్రతీ బ్లాక్‌ లో ఓ బిల్‌కలెక్టర్‌ నేతృత్వంలో లైసెన్స్‌ రుసుమును వసూ ళ్లు చేయాలని ఆదేశించింది.

పట్టణంలో 3200 దుకాణ సముదాయాలు

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులుండగా.. ఆ యా వార్డులో 3200పైగానే దుకాణా సముదాయాలున్న ట్లు మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. అత్యధికంగా సు భాష్‌రోడ్డు, జేపీయన్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, నిజాంసాగర్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌, సిరిసిల్లరోడ్డు, హౌజింగ్‌బోర్డు కాలనీ, స్టేషన్‌రోడ్డు ప్రాంతాల్లో వాణిజ్య, వర్తక సముదా యాలున్నాయి. ఇందు లో కేవలం 700 వరకు మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌ ను రెన్యూవల్‌ చేయిం చుకున్నారు. మరి కొం దరైతే అసలు ట్రేడ్‌లైసె న్స్‌ తీసుకోకుండానే వ్యాపారాలను చేసుకుం టున్నారు.

రెన్యూవల్‌లో నిర్లక్ష్యం..

ట్రేడ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకోవ డంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమం ది వ్యాపారులు దశాబ్ధకాలంగా లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసు కోక వ్యాపారాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు, రాజకీయ నాయ కులు కొందరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులపై ఒత్తిడి చే స్తున్నారు. కానీ ఎవరు చెప్పినా ట్రేడ్‌ లైసెన్స్‌ విషయంలో అలసత్వం వహించొద్దని, కచ్చితంగా లైసెన్స్‌, రెన్యూవల్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలని చైర్‌పర్సన్‌ అధికారులను ఆదేశించింది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసే గడువుకు ఒకనెల ముందుగానే రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ ఒకరిని చూసి మరోకరు అన్నట్లు వ్యాపారులు మున్సిపల్‌ అధికా రుల ఉత్వర్వులను బేఖాతారు చేస్తున్నారు. మున్సిపల్‌ అ ధికారులు దుకాణాలను తనిఖీ చేసినప్పుడు అప్పటికప్పుడే లైసెన్స్‌ ఫీజు చెల్లిస్తున్నారు.

రూ.70లక్షలకు పైగా బకాయిలు

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయిలు రూ.70లక్షలకు పైగా పే రుకుపోయాయి. యేళ్ల నుంచి సరిగ్గా వసూలు చేయడం లేదు. రెండు నెలల క్రిందట వ్యాపారులతో మున్సిపల్‌ చై ర్‌పర్సన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి కచ్చితంగా ట్రేడ్‌ లై సెన్స్‌లు తీసుకోవాలని, లేదంటే కఠినంగా వ్యవహరిస్తా మని హెచ్చరించింది. దీంతో కొందరిలో కదలిక రాగా మ రికొందరు ఎప్పటిలాగే నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరి స్తున్నారు.  10 రోజులుగా పట్టణంలో మున్సిపల్‌ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ప్రతీ దుకాణానికి వెళ్లి ట్రేడ్‌ లైసెన్స్‌ ఉందా? లేదా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయించుకోకపోతే..

దుకాణాల లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకోకపోతే బారీగా జరిమానా విధించే అవకాశాలున్నాయి. కొత్త జివో ప్రకారంగా బకాయి పడిన వ్యాపారులకు 25శాతం నుంచి 50శాతం వరకు జరిమానా వసూలు చేసే వీలుంది. మరో పక్క దుకాణాల కొలతలు తీసుకుని కొత్తగా రేట్‌ను నిర్ణ యించనున్నారు. ఇక ప్రతీ దుకాణం తగిన దస్త్రాలు కలిగి ఉండాలని, లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయించుకునే క్రమంలో తప్పుడు దస్త్రాలను సమర్పిస్తే 25శాతం జరిమానా విధిం చడంతోపాటు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయని కొత్త జివో చెబుతోంది.

ట్రేడ్‌ లైసెన్స్‌ను తీసుకుని వ్యాపారాలు చేసుకోవాలి

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జివో అమలుపై దృ ష్టి సారించాం. ట్రేడ్‌ లైసె న్స్‌ను రెన్యూవల్‌ చేసుకో వాలి. రెండు నెలల కింద టే వ్యాపారులతో సమావే శం ఏర్పాటు చేసి చె ప్పాం. మున్సిపాలిటీ పరి ధిలో 3200 ట్రేడ్‌లైసెన్స్‌ దుకాణాలుండగా.. 1000 లోపు మాత్రమే లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేసుకు న్నారు. హెచ్చరికలు పెడచెవిన పెడితే కఠినం గా వ్యవహరిస్తాం. కొత్త జీవో అమలులోకి వస్తే వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

- నిట్టుజాహ్నవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కామారెడ్డి

Updated Date - 2020-12-03T05:17:52+05:30 IST