వెల్లివిరిసిన సృజనాత్మకత

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

కాలానుగుణంగా కొత్త కొత్త పరి కరాలను రూపొందిస్తూ...స్థానిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో పలువురు జిల్లా వాసుల సృజనాత్మకత వెల్లివిరిసింది.

వెల్లివిరిసిన సృజనాత్మకత

- ఇంటింటా ఇన్నోవేటర్‌లో జిల్లా వాసుల ప్రతిభ

- విజేతలుగా నిలిచిన ఆరుగురు

జగిత్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కాలానుగుణంగా కొత్త కొత్త పరి కరాలను రూపొందిస్తూ...స్థానిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో పలువురు  జిల్లా వాసుల సృజనాత్మకత వెల్లివిరిసింది. రాష్ట్ర నూతన ఆవిష్కరణల సె ల్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 13 ప్రదర్శన లు రాగా అందులో ఆరు ప్రదర్శనలు విజేతలుగా నిలిచాయి. నూతన ఆ విష్కరణలను స్వాతంత్య్ర వేడుకల్లో సైతం ప్రదర్శించి శభాష్‌ అనిపిం చుకున్నారు. 

పంట రక్షణ మరింత సులువుగా...

ప్రస్తుత కాలంలో రైతులు ఎదుర్కొంటున్న చేతి  కందిన పంటను సం రక్షించడం సమస్యను అదిగమించేందుకు అనుగుణంగా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెట్‌ప ల్లికి చెందిన ఇంద్రాల సతీష్‌ కుమార్‌ క్రాప్‌ ప్రొటెక్టర్‌ అను నూతన పరికరాన్ని రూ. 5వేల వ్యయంతో తయారు చేశాడు. ఇనుప వైపునకు ఇరువైపులా సైకిల్‌ హబ్‌లను వెల్డింగ్‌ చేసి ఒక సైకిల్‌ హబ్‌కు త్రిభుజా కార ఇనుప రేకును చిన్న రాడ్‌ సహాయంతో అతికించాడు. మరో సైకిల్‌ హబ్‌కు కూలర్‌ ఫ్యాన్‌ను మరొక వైపునకు ఇనుప బిల్లను అమర్చాడు. త్రిభుజాకారంలో ఉన్న ఇనుప రేకు కూలర్‌ ఫ్యాన్‌ను గాలి వీచే దిశకు మళ్లిస్తుంది. తద్వారా గాలికి ఫ్యాన్‌ తిరగడం వల్ల దానికి అమర్చిన ఇను ప బిల్ల స్టీలు ప్లేటును తాకడం వల్ల శబ్ధం వచ్చేలా రూపొందించాడు. ఈ శబ్ధానికి కోతులు, పక్షులు, అడవి పందులు వంటివి దగ్గరికి రాకుండా పంట సంరక్షించబడేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనిని పొలంలో అక్క డక్కడ అమర్చితే పంటను సులభంగా సంరక్షించుకునేలా తయారు చేశాడు.

కోకోనట్‌ ష్రడ్డింగ్‌ మిషన్‌...

తాగి పడేసే కొబ్బరి బోండాలను ముడి పదార్థంగా వినియోగించి పరి శ్రమను ఏర్పాటు చేసుకోవడంతో పాటు నలుగురు ఉపాధి పొందేలా   మెట్‌పల్లి పట్టణానికి చెందిన అల్లాడి ప్రభాకర్‌ తయారు చేసిన కొబ్బరి బోండముల క్రషింగ్‌ యంత్రం విశేషంగా ఆకట్టుకుంది. కొబ్బరిబోండాలను క్రష్‌ చేయడం వల్ల కోకోఫీట్‌, కోకో ఫైబర్‌ అను పదార్థాలు ఉత్పత్తి అవు తుంటాయి. పౌడర్‌ మాదిరిగా ఉత్పత్తి అయ్యే కోకోఫీట్‌ను రైతులు తమ పంట పొలాలు, నర్సరీలు, గార్డెన్స్‌, ఇళ్లలో ఎరువుగా వినియోగించే వీ లుంటుంది. దీని వల్ల నేలలో నీటి తేమ శాతం ఎక్కువ రోజులు ఉండ డంతో పాటు మొక్కలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కోకోఫైబర్‌ వాణిజ్య పరంగా లాభసాటిగా ఉంటుంది. కొబ్బరి పీచు ద్వారా కొబ్బరి తా ళ్లు, విగ్రహాల తయారీలు, కుర్చీలు, సోపాలు, ఫాల్‌ సీలింగ్‌ వంటి త యారీలో వినియోగంచే అవకాశం ఉంది. కోకోనట్‌ ష్రెడ్డింగ్‌ యంత్రం చి న్న చిన్న గ్రామాలలో, పట్టణాల్లో సులువుగా ఏర్పాటు చేసుకునే విధంగా పరికరాన్ని రూపొందించాడు. 3 హెచ్‌పీ మోటార్‌ సింగల్‌ ఫేస్‌ కరెంట్‌తో పనిచేయడంతో పాటు మిషన్‌ గంటకు సుమారు 200 కొబ్బరి బోం డాలను క్రష్‌ చేసేలా తయారు చేశాడు. 

రైతులకు ఉపయోగకరంగా ఎంఎస్‌ నీరటి రోబో...

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పంట పరంగా, విద్యుత్‌ పరంగా ఉ పయోగంగా ఉండేలా ఎంఎస్‌ నీరటి రోబో అను యంత్రాన్ని మల్లాపూర్‌ మండలం రాఘవపేటకు చెందిన మెండె శ్రీనివాస్‌ రూపొందించాడు. పం ట సరిగా పండడానికి పొలానికి నీరు అందించే సందర్భంలో ఆటోమెటిక్‌ గా నీరు సరిపోయేలా మోటర్‌ ఆన్‌అయ్యేలా పరికరాన్ని తయారు చేశా డు. దీని వల్ల మోటార్లు కాలిపోకుండా ఉంటాయని ఇన్నోవేటర్‌ అంటు న్నాడు. దీనికి తోడు విద్యుత్‌ వినియోగం సైతం తక్కువగా ఉంటుంది.    నీరు అయిపోతే మోటారు దానికదే ఏ ప్రమేయం లేకుండా ఆటోమెటిగా ఆఫ్‌ అయ్యేలా రూపొందించాడు. 

తడిచిన ధాన్యాన్ని నిమిషాల వ్యవధిలో ఆరబెట్టేలా...

తడిచిన ధాన్యాన్ని నిమిషాల వ్యవధిలో ఆరబెట్టేలా ప్రత్యేక యంత్రాన్ని పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన గోనె కిషన్‌ కుమా ర్‌ రూపొందించాడు. దీని వల్ల ధాన్యం ఆరబెట్టే విధానంలో రైతుకు కూ లీల అవసరం ఉండదు. రైతుకు 10 నుంచి 15 రోజుల శారీరక శ్రమ అ వసరం తప్పుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వడ్లకు మొలకలు రాకుం డా, నలుపు రంగులోకి మారకుండా తగిన జాగ్రత్తలతో యంత్రం ద్వారా రక్షించడానికి వీలుగా తయారు చేశాడు. రైతుకు టార్పాలిన్‌, పరదల ఖర్చులు సైతం ఆదా అవుతాయని ఇన్నోవేటర్‌ అంటున్నాడు.

సులువుగా కలుపు తీసేలా...

పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంట సాగులో సులువుగా కలుపు తీసి కూలీల కొరత, కూలీ రేట్ల సమస్యను అధిగమించేలా సింగిల్‌ వీల్‌ మ్యాన్‌ మినీ వీడర్‌ పరికరాన్ని రాయికల్‌ మండలం కుమ్మరిపల్లికి చెందిన ఇంజమూరు హర్షిత అను విద్యార్థిని తయారు చేసింది. కేవలం రూ. 650 వ్యయంతో దీనిని రూపొందించింది. ఒక్క రోజులో ఆరుగురు చేసే పనిని ఈ వీడర్‌ ఒక్క మనిషి ఒక్క రోజులో పూర్తి చేసేలా తయా రు చేసింది. దీని ద్వారా కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పా టు చిన్న సన్న కారు రైతులకు ఉపయోగంకరంగా ఉండనుంది. ఇను ప పైప్‌నకు ఒక చిన్న సైకిల్‌ టైరు, ఒక చిన్న పాటి పలుకు బిగించింది.  సాలు తక్కువ, ఎక్కువ చేసుకోవడానికి అడ్జస్ట్‌మెంట్‌గా ఒక రాడ్‌ను వె ల్డింగ్‌ చేసి అమర్చింది. ఒక ఇనుప పైప్‌తో హ్యాండిల్స్‌ తయారు చేసి వెల్డింగ్‌ చేసింది. ఎక్కడికంటే అక్కడికి సులువుగా పరికరాన్ని తీసుకుని వెళ్లేలా పరికారన్ని తయారు చేసింది.

నలుగురు చేసే పనిని ఒక్కరు చేసేలా..

పంట పొలాలకు ఫర్టిలైజర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో నలుగురు చేసే పనిని ఒక్కరు సులువుగా చేసే విధంగా ఫర్టిలైజర్‌ డిస్ట్రిబ్యూటర్‌ మిషన్‌ను మెట్‌ పల్లి అనుబంద గ్రామమైన ఆరపేటకు చెందిన పుడికారపు మోహన్‌ రెడ్డి అను రైతు తయారు చేశాడు. దీని వల్ల యూరియా అడుగుమందును పత్తి, మొక్కజొన్న, పలు రకాల కాయగూరలకు సులువుగా అందించే వి ధంగా తయారు చేశాడు. పరికరాన్ని ఉపయోగించి నలుగురు చేసే పని ని ఒక్కరు తక్కువ సమయంలో పూర్తిచేసేలా రూపొందించాడు. కరెంటు అవసరం లేకుండా పనిచేసే విధంగా పరికరాన్ని తయారు చేశాడు. హరి తహారం మొక్కలకు నీరు అందించడానికి సైతం ఇది ఉపయోగపడు తుందని ఇన్నోవేటర్‌ అంటున్నాడు. 

జిల్లా వాసుల ప్రతిభ అభినందనీయం

- బాజోజి శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి

రాష్ట్ర ఆవిష్కరణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నో వేషన్‌ పోటీల్లో పలువురు జిల్లా వాసులు కనబరిచిన ప్రతిభ అభినం దనీయం. సామాజిక ఉపయోగకరమైన, సమయం ఆదా, అల్ప వ్యయం తో సులభతరంగా తయారు చేసిన వాటిని విజేతలుగా ఎంపిక చేశాం. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కలెక్టర్‌ రవి నాయక్‌ల చేతుల మీదుగా అవార్డులను అందించాం.


Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST