ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చావును కొని తెచ్చుకున్నట్టే.. 4 రోజులుగా వరుడికి ఫోన్ కాల్స్..

ABN , First Publish Date - 2022-04-21T21:24:51+05:30 IST

అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని నెంబర్ నుంచి వరుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వాళ్ల మాటలు వి

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చావును కొని తెచ్చుకున్నట్టే.. 4 రోజులుగా వరుడికి ఫోన్ కాల్స్..

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని నెంబర్ నుంచి వరుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వాళ్ల మాటలు విని వరుడు షాకయ్యాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చావును కొని తెచ్చుకున్నట్టే అంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటంతో కంగుతిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన శేఖర్.. బంధ్‌వాడీ గ్రామానికి చెందిన ఓ యువతితో గత కొన్ని రోజలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తాజాగా వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. నిశ్చితార్థం జరిపించి, పెళ్లి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 21న పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం శేఖర్‌కు ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వాళ్ల మాటలు విని శేఖర్ షాకయ్యాడు.



తర్వాత ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. కానీ ముహూర్తానికి కొన్ని గంటల ముందు కూడా గుర్తు తెలియని వ్యక్తి పదే పదే ఫోన్ చేసి ‘ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చావును కొని తెచ్చుకున్నట్టే’ అని బెదిరింపులకు పాల్పడుతుండటంతో శేఖర్ సహా అతడి కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. గురువారం రోజు ఉదయం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లి పూర్తయ్యే వరకు తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 



Updated Date - 2022-04-21T21:24:51+05:30 IST