Cab Driver ను తుపాకీ, కత్తులతో బెదిరించి...!

ABN , First Publish Date - 2021-11-19T12:12:13+05:30 IST

Cab Driver ను తుపాకీ, కత్తులతో బెదిరించి...!

Cab Driver ను తుపాకీ, కత్తులతో బెదిరించి...!

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : కాటేదాన్‌లోని పాత కర్నూల్‌ రోడ్‌లో ఓ ఆటోడ్రైవర్‌ను గుర్తుతెలియని దుండగులు తుపాకీ, కత్తులతో బెదిరించి దోచుకున్నారు. క్యాబ్‌ ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్న మోసిన్‌ గురువారం ఉదయం పాత కర్నూల్‌ రోడ్డులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. తుపాకీ, కత్తులు చూపి అతడి జేబులో ఉన్న రూ.3,200, సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయారు.  దీంతో బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2021-11-19T12:12:13+05:30 IST