Serial Killer: వీడు మనిషి కాదు నరరూప రాక్షసుడు.. నీ కూతురి మాంసం చాలా రుచిగా ఉందంటూ ఓ తల్లికి లేఖను రాసి మరీ..

ABN , First Publish Date - 2022-08-14T16:55:23+05:30 IST

మహేశ్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాను చూశారా..? బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమానైనా వీక్షించారా..? ఇప్పుడు ఆ సినిమాల గురించో, ఆ సినిమాల్లోని హీరోల గురించో మనం చెప్పుకోవడం లేదు. ఆ సినిమాల్లో విలన్లైన అయిన సీరియల్ కిల్లర్ల గురించే మనం చెప్పుకోబోతున్నాం.

Serial Killer: వీడు మనిషి కాదు నరరూప రాక్షసుడు.. నీ కూతురి మాంసం చాలా రుచిగా ఉందంటూ ఓ తల్లికి లేఖను రాసి మరీ..

మహేశ్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాను చూశారా..? బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమానైనా వీక్షించారా..? ఇప్పుడు ఆ సినిమాల గురించో, ఆ సినిమాల్లోని హీరోల గురించో మనం చెప్పుకోవడం లేదు. ఆ సినిమాల్లో విలన్లైన అయిన సీరియల్ కిల్లర్ల గురించే మనం చెప్పుకోబోతున్నాం. పరిస్థితుల నేపథ్యం వల్లనో.. పెరిగిన వాతావరణం వల్లనో కొందరిలో క్రూరమైన ఆలోచనలు కలుగుతాయి. అవతలి వాళ్లు బాధపడితే.. ఎదుటి వ్యక్తులు హింసను అనుభవిస్తోంటే చూస్తూ ఆనందించే వికృత స్వభావం వారిలో పెరిగిపోతుంది. ఆ విపరీత ఆలోచనలు మరింత శృతిమించి చివరకు మనుషుల మాంసాన్ని రుచిచూడాలన్న కోరిక దాకా వెళ్తే.. వారే నరరూప రాక్షసులుగా రూపాంతంరం చెందిన వారవుతారు. తెలుగులోనే కాదు.. ఇతర భాషల భారతీయ సినిమాల్లోనూ, హాలీవుడ్ సినిమాల్లోనూ సీరియల్ కిల్లర్ నేపథ్యంలో సాగే సినిమాలకు నిజజీవితంలో జరిగిన ఘటనలే స్పూర్థి అంటే మీరు నమ్మగలరా..? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ వ్యక్తి గురించి దారుణ నిజాలు తెలిస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా..? వీడసలు మనిషేనా..? అనకుండా ఉండలేరు. 


‘నేను మీ కూతురి వివస్త్రను చేశాను. ఆమె నన్ను కొట్టింది.. గోర్లతో రక్కింది, నా పట్టు విడిపించుకోవడానికి గింజుకుంది. ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపాలని అనుకున్నాను. అనుకున్నట్టే ఉక్కిరిబిక్కిరి చేసి చంపాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి గదిలోకి తీసుకెళ్లి ఉడికించుకుని తిన్నాను. ఆమె వెనుక భాగం ఎంత మృదువుగా, మధురంగా ఉందో తిన్న నాకే తెలుసు. తన మాంసం మొత్తం తినడానికి నాకు 9 రోజులు పట్టింది. కావాలనుకుంటే నేను గ్రేస్ ను రేప్ చేయచ్చు కానీ ఆమెను నేను రేప్ చేయలేదు. ఆమెను కన్యగానే చంపి తిన్నాను..’ ఇదీ బాలిక కనిపించకుండా పోయిన ఆరేళ్ల తర్వాత ఆమె తల్లికి ఓ కిరాతకుడు రాసిన లేఖ. ఇది చదివిన ఆ తల్లి పరిస్థితి గురించి ఏమని వివరించగలం. ఆ కిరాతకుడి పేరే ‘ఆల్బర్ట్ ఫిష్’ అలియాస్ బ్రూక్లిన్ వాంపైర్. ఈ ఘటన జరిగింది అమెరికాలో. ఏళ్లు గడుస్తున్నా.. ఎందరో సైకోల అరాచకాలు వెలుగులోకి వచ్చినా ఈ ఆర్బర్ట్ ఫిష్ పేరు వింటే అమెరికన్లలో ఇప్పటికీ భయంభయమే..


ఎవరీ ఆల్బర్ట్ ఫిష్.. 

ఆల్బర్ట్ ఫిష్ 1870వ సంవత్సరం, మే 19 వ తారీఖున వాషింగ్టన్ లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో హోమిల్డన్ హోవార్డ్ ఫిష్ అనే వ్యక్తికి జన్మించాడు. ఆల్బర్ట్ ఫిష్ కుటుంబం మొత్తం మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారే. అతని తల్లికి మతిభ్రమించింది, మామయ్య ఉన్మాదిగా మారాడు, అక్క మానసిక రుగ్మతలతో బాధపడేది. అన్నయ్య చిన్నప్పుడే మానసిక సమస్యతో ఆసుపత్రికి పరిమితమయ్యాడు. పిల్లలందరిలోకి ఆల్బర్ట్ ఫిష్ చిన్నవాడు. 1875వ సంవత్సరంలో హోమిల్డన్ హోవార్డ్ ఫిష్ గుండెపోటుతో చనిపోవడం వల్ల కుటుంబ భారం మొత్తం ఆల్బర్ట్ ఫిష్ తల్లిమీద పడింది. తల్లి ఆర్థికభారం మోయలేక ఆల్బర్ట్ ఫిష్ ను సెయింట్ జాన్స్ పిల్లల అనాధాశ్రమంలో వదిలిపెట్టింది. ఆ అనాధాశ్రమంలో ఉండే సంరక్షకుల చేతిలోనూ, తోటి పిల్లలతో గొడవల వల్ల దాదాపు అయిదు సంవత్సరాలపాటు ఆల్బర్ట్ ఫిష్ చావుదెబ్బలు తిన్నాడు. సెయింట్ జాన్స్ అనాధాశ్రమం గురించి ఆలోచించినప్పుడల్లా "నా ప్రయాణం ఇక్కడ మొదలవ్వకుండా ఉండాల్సింది" అని ఆల్బర్ట్ ఫిష్ అనుకునేవాడు. తినగతినగ వేము తియ్యనుండు అని వేమన గారు చెప్పినట్టుగా ఆ అనాధాశ్రమంలో వాతావరణం, హింస, దెబ్బలు వీటన్నింటినీ ఆల్బర్ట్ ఫిష్ ఆస్వాదించడం మొదలుపెట్టాడు. నెమ్మది నెమ్మదిగా నొప్పిని, బాధను ఇష్టపడటాన్ని అలవాటుగా చేసుకున్నాడు. అతడి తల్లి ఆ అయిదు సంవత్సరాలలో ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచుకున్నా.. తిరిగి తన వద్దకు తెచ్చుకున్నా అప్పటికే ఆల్బర్ట్ ఫిష్ లో మానసికపరమైన మార్పులు చాలానే చోటుచేసుకున్నాయి.


మూత్రాన్ని తాగి, మలాన్ని తిని.. సూదులతో గుచ్చుకుని..

ఆల్బర్ట్ ఫిష్ కి 1882 లో స్థానిక టెలిగ్రాఫ్ ఆఫీస్ బాయ్ తో పరిచయమయింది. అతను కూడా మానసిక సమస్యలు ఉన్నవాడు కావడంతో అతడితో కలసి మూత్రాన్ని తాగడం, మలాన్ని తినడం చేసేవాడు.  తన శరీరంలో పొత్తికడుపు కండరాలకు, కాలి గజ్జెల భాగంలో సూదులతో గుచ్చుకొనేవాడు. ఇవన్నీ ఆ తర్వాతి కాలంలో ఆల్బర్ట్ ఫిష్ ని అరెస్ట్ చేసిన తరువాత అతని ఎక్స్-రే రిపోర్ట్ లలో తెలిశాయి. సుమారు 29 చోట్ల వాటి తాలూకూ గుర్తులున్నట్టు నిర్ధారించారు.


1890లో ఆల్బర్ట్ ఫిష్ 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతడిని న్యూయార్క్ నగరానికి పంపేశారు. అయితే అతని క్రూరత్వం అక్కడ ఇంకా ఎక్కువయ్యింది. అతను మొదట న్యూయార్క్ నగరంలో బయట తిరుగుతున్న చిన్నపిల్లలపై అత్యాచారం చేసేవాడు. గోర్లతో రక్కుతూ పాశవిక ఆనందం పొందేవాడు. 1898లో మొదట తన కుటుంబం మీదనే అతను తన క్రూరత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 1910లో డెలావేర్ లో ఇళ్లకు రంగులు వేస్తున్నప్పుడు థామస్ కెడెన్ అనే మానసిక వికలాంగుడిని కలిసాడు. వారిద్దరిమధ్య స్నేహపూరిత సంబంధం ఏర్పడింది. అయితే అది కాస్తా థామస్ కెడెన్ పురుషాంగాన్ని ఆల్బర్ట్ ఫిష్ కత్తిరించడంతో ముగిసిపోయింది.  తరువాత ఆల్బర్ట్ ఫిష్ మానసికంగా దుర్భరమైన స్థితిలోకి జారిపోయాడు, 1919 సంవత్సరం నాటికి పచ్చిమాంసాన్ని మాత్రమే తినేస్థాయికి దిగజారిపోయాడు. 1919 లోనే జార్జ్ టౌన్ లో ఇంకొక మానసిక సమస్య ఉన్న అబ్బాయిని కత్తితో పొడిచాడు.  అతనెప్పుడూ మానసిక వికలాంగులనే ఎంచుకునేవాడు. వాళ్లకోసమే ఎంతో గాలించేవాడు. నల్లజాతి వారికోసం గాలిస్తున్నపుడు తెల్లజాతి అమ్మాయిలు అతడిని ఆకర్షించారు. వారిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించి రెండుసార్లు విఫలం అయ్యాడు. 1928 మే 25వ తారీఖున 10 ఏళ్ల వయసున్న గ్రేస్ బడ్ అనే బాలిక అన్నయ్య అయిన ఎడ్వర్డ్ బడ్.. ఆల్బర్ట్ ఫిష్ కళ్ళలో పడ్డాడు. ఎడ్వర్డ్ బస్ ప్రకటించిన క్లాసిఫైడ్ యాడ్ చూసి తన ఆలోచనకు అతడినే పావుగా వాడుకోవాలని అనుకున్నాడు.


గ్రేస్ బడ్ ని హత్యచేసిన తీరు!!

ఆల్బర్ట్ ఫిష్, ఎడ్వర్డ్ బడ్ ను కలసి తనను తాను ఫ్రాంక్ హోవార్డ్ పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఒక పెద్ద భూస్వామికి సంబంధించి క్లాసిఫైడ్ యాడ్స్ కోసం పని చేయాల్సి ఉంటుందని ఎడ్వర్డ్ కు ఆశ చూపించాడు. 18 సంవత్సరాల ఎడ్వర్డ్ కు అందులో మోసం ఉందని అనిపించలేదు. తన పనికి గుర్తింపు, తగిన మొత్తంలో జీతం వస్తుందనే అనుకున్నాడు. దాంతో ఆల్బర్ట్ ఫిష్ చెప్పిన పనికి ఒప్పుకున్నాడు. అయితే ఆల్బర్ట్ ఫిష్ మాత్రం ఎడ్వర్డ్ చెల్లెలు గ్రేస్ బడ్‌ను చంపడానికి ప్రణాళికలు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 


అతని మనసులో గ్రేస్ బడ్‌ని హింసించాలనే కోరిక రోజురోజుకూ పెరిగిపోయింది. 1928వ సంవత్సరం జులై నెలలో ఎడ్వర్డ్ ఇంటికి వెళ్లాడు. 10 సంవత్సరాల గ్రేస్ బడ్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తన మేనకోడలు పుట్టినరోజు పార్టీకి ఆమెను పంపాలని ఆమె తల్లిదండ్రులను అనుమతి అడిగాడు. ఎన్నో మాయమాటలు చెప్పి చివరికి గ్రేస్ తల్లిదండ్రులు అయిన డెలియా ప్లానాగన్, ఆల్బర్ట్ బడ్ లను ఒప్పించాడు. తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో పుట్టినరోజు పార్టీ కోసం ఎంతో అందంగా తయారయ్యింది గ్రేస్ బడ్. అదే సమయంలోఎడ్వర్డ్ బడ్ ను నమ్మించడానికి అతడికి జీతంగా గంటకు 15 డాలర్లు ఇవ్వడంతో పాటు అతని స్నేహితుడిని కూడా పనిలోకి తీసుకుంటానని  ఆల్బర్ట్ ఫిష్ మాట ఇచ్చాడు. ఈ కారణాల వల్ల ఆ కుటుంబానికి ఆల్బర్ట్ ఫిష్ మీద ఎలాంటి అనుమానం కలగలేదు.


గ్రేస్‌బడ్‌ను ఆల్బర్ట్ ఫిష్ తీసుకెళ్లాడు కానీ.. మళ్లీ ఇంటికి తిరిగి తీసుకురాలేదు. గ్రేస్ బడ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో వెతికారు. అటు ఆల్బర్ట్ ఫిష్ కోసం కూడా గాలించారు. ఇద్దరూ కనిపించకుండా పోయారు. మిస్సింగ్ కేసు, కిడ్నాప్ కేసు పెట్టారు కానీ.. పోలీసులు ఎంత వెతికినా ఆల్బర్ట్ ఫిష్ ఆచూకీని కనిపెట్టలేకపోయారు. కానీ పోలీసులే కాదు.. గ్రేస్ బడ్ తల్లిదండ్రులు కూడా ఊహించని రీతిలో ఆల్బర్ట్ ఫిష్ చేసిన ఒక్క పొరపాటు వల్ల అతడు దొరికిపోయాడు. నీ కూతురిని ఎలా చంపానో తెలుసా.. అంటూ 1934వ సంవత్సరంలో అతడు రాసిన లేఖలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదే లేఖలో తాను నరరూప రాక్షసుడిలా ఎలా మారానన్నది కూడా వివరించాడు. చివరకు ఆ లేఖ ఆధారంగానే పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..


ప్రియమైన శ్రీమతి బడ్ కి..

1894లో నా స్నేహితుడు కెప్టెన్ జాన్, డేవిస్ అనే తన స్నేహితుడితో కలసి రవాణా వ్యాపారం కోసం సముద్ర ప్రయాణం చేశారు. వారు శాన్ ఫ్రాన్సిస్కో నుండి హాంకాంగ్ చైనాకు ప్రయాణించారు. వారు అక్కడికి రాగానే వారికి మరొక ఇద్దరు స్నేహితులు కలిశారు. వాళ్ళు నలుగురూ స్టీమర్ దిగి అక్కడి ఒడ్డుకు వెళ్లి మద్యం సేవించారు. అయితే వారు తిరిగి వచ్చేసరికి పడవ వెళ్ళిపోయింది. అదే సమయంలో చైనాలో కరువు వచ్చింది. అక్కడ ఒక పౌండ్ మాంసం 1 నుండి 3 డాలర్లకు అమ్మేవారు. పేదవాళ్లకు అది చాలా భారంగా మారింది. ఆ సంక్షోభంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను కసాయివాళ్లకు అమ్మడం మొదలుపెట్టారు. దానివల్ల ఇతరులు ఆకలితో అలమటించకుండా ఉండటానికి ఒక మార్గం దొరికింది. 14 సంవత్సరాల లోపు వారికి అక్కడ రక్షణ లేకుండా పోయింది.  మాంసం అమ్మే దుకాణాలకు వెళ్లి నేరుగా కావలసిన శరీరభాగాల నుండి మాంసాన్ని అడిగి కొనుగోలు చేయవచ్చు. లేతగా ఉన్న మాంసం కట్‌లెట్‌లకు వాడుకుని తింటే ఎంతో మధురంగా ఉండేది. అలాంటి మాంసాన్ని అధిక ధరకు అమ్మేవారు.


నా స్నేహితుడు జాన్ చాలాకాలం అక్కడే ఉండి మనిషి మాంసాన్ని రుచి చూసాడు. అతను తిరిగి న్యూయార్క్ కు తిరిగి వచ్చాక ఇద్దరు అబ్బాయిలను ఎత్తుకొచ్చాడు. వారిలో ఒకరికి 7 సంవత్సరాలు, మరొకరికి 11 సంవత్సరాలు. అతడు వారిద్దరినీ ఒకగదిలోకి తీసుకొచ్చి బట్టలు తీసేసి వాళ్ళను నగ్నంగా కట్టేసి ఉంచాడు. వాళ్ళను కాల్చుకుని తిన్నాడు. దానికి ముందు వారి మాంసం రుచిగా ఉండాలని వారిని బాగా కొట్టేవాడు. చిత్రహింసలు పడి చనిపోయిన వారి మాంసం చాలా రుచిగా ఉంటుందట. మొదట 11 సంవత్సరాల అబ్బాయిని చంపాడు. అతని వెనుకబాగం బాగా కండపట్టి ఉండేదనీ.. అది ఎంతో రుచిగా ఉంటుందని అతడు చెప్పేవాడు. ఆ తరువాత 7 సంవత్సరాల అబ్బాయిని కూడా అదేవిధంగానే చంపి తిన్నాడు. తల, ఎముకలు, ప్రేగులు తప్ప అన్ని భాగాలను వండుకుని తిన్నాడు. 


జాన్ అలా చేసిన సమయంలో  409 E 100 St, వెనుక కుడివైపు నేను నివసించేవాడిని. మనిషి మాంసాన్ని రుచి చూడాలని అతడు తరచుగా నాతో చెప్పేవాడు కాబట్టి నాలో ఆ ఆలోచన మొదలైంది. జూన్ 3, 1928 వ తారీఖున నేను మీకు 406 w 15 సెయింట్ దగ్గర నుండి ఫోన్ చేసాను. మీకోసం ఫాట్ చీజ్, స్ట్రాబెర్రీలు తెచ్చాను. ఆ రోజు మీరు నాతో ఎంతో సంతోషంగా మాట్లాడారు, అందరం భోజనం చేసాము.  తరువాత నేను గ్రేస్ బడ్ ను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. అప్పుడు గ్రేస్ నాకు ముద్దు పెట్టింది. అప్పుడే నేను గ్రేస్ ను రుచి చూడాలని నిర్ణయించుకున్నాను. తనను పార్టీకి తీసుకెళ్తానని మిమ్మల్ని ఒప్పించాను. వెస్ట్‌చెస్టర్‌లోని ఒక పాత ఖాళీ ఇంటికి తనను తీసుకెళ్ళాను.


తనని బయటే ఉండమని చెప్పి నేను లోపలికి వెళ్ళి రక్తం నామీద పడకుండా ఉండటానికి నగ్నంగా తయారయ్యాను. గ్రేస్ బయట అడవి పువ్వులను చూస్తూ ఎంతో ఆనందించింది. ఆ తరువాత కిటికీ నుండి గ్రేస్ ను లోపలికి రమ్మన్నాను. ఆమెకు కనిపించకుండా నేను వేరే గదిలో దాక్కున్నాను.  అయితే ఆమె నన్ను నగ్నంగా చూసిన తరువాత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమెను గట్టిగా పట్టుకున్నాను. నేను మా మామయ్యతో చెబుతానని నన్ను భయపెట్టాలని చూసింది. నేను ఆమెను వదల్లేదు, మొదట ఆమెను వివస్త్రను చేసాను. ఆమె నన్ను కొట్టింది. గోర్లతో రక్కింది. నా పట్టు విడిపించుకోవడానికి గింజుకుంది. ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపాలని అనుకున్నాను. అనుకున్నట్టే ఉక్కిరిబిక్కిరి చేసి చంపాను. చిన్న చిన్న ముక్కలుగా కోసి గదిలోకి తీసుకెళ్లి ఉడికించుకుని తిన్నాను. ఆమె వెనుక భాగం ఎంత మృదువుగా, మధురంగా ఉందో తిన్న నాకే తెలుసు. తన మాంసం మొత్తం తినడానికి నాకు 9 రోజులు పట్టింది. ఇదీ నీ కూతురైన గ్రేస్ బడ్ ను నేను చంపి, ముక్కలుగా కోసి తిన్న విధానం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. కావాలనుకుంటే నేను గ్రేస్ ను రేప్ చేయచ్చు కానీ ఆమెను నేను రేప్ చేయలేదు. ఆమె కన్యగానే మరణించింది..’


గ్రేస్ బడ్ తల్లికి చదువు రాకపోవడంతో కొడుకు ఎడ్వర్డ్ బడ్ ఈ లేఖను ఇంట్లో బిగ్గరగా చదివాడు. కూతురు కనిపించకుండా పోయిన ఆరేళ్ల తర్వాత కూతురి గురించి వచ్చిన ఈ లేఖను చదవడం పూర్తి చేసిన తర్వాత ఎడ్వర్డ్ బడ్ గొంతు ఆగిపోయింది. అతని గొంతు దుఃఖంతో నిండిపోయింది. వెంటనే ఈ లేఖ విషయమై గ్రేస్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకుముందు ఆరేళ్లుగా పోలీసులు వెతికినా కనీసం గ్రేస్ బడ్ ఆచూకీ ఏమీ వాళ్లకు దొరకలేదు. ఆల్బర్ట్ రాసిన ఉత్తరమే అన్ని విషయాలను తేటతెల్లం చేసింది. చివరికి అదే అతడిని పోలీసులకు పట్టించింది. 


పోలీసుల వేట!!

ఎడ్వర్డ్ బడ్, ఆల్బర్ట్ ఫిష్ పంపిన ఉత్తరం చదవగానే దాన్ని పోలీసులకు అందించాడు. ప్రయివేటు డ్రైవర్ ల కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న అసోసియేషన్ ను గురించి తెలిపే షట్కోణాకృతి ఉత్తరం ఉన్న కవరు మీద ఉంది. దాని ఆధారంగా కంపెనీ మెయిన్ బ్రాంచ్ లో ఒక కాపలావాడిని అడిగితే ఒక వ్యక్తి కొంత స్టేషనరీని ఇంటికి తీసుకెళ్లినట్టు అతడు చెప్పాడు.  వాళ్ళు 52వ వీధిలో ఆల్బర్ట్ పాత ఇంటి దగ్గరకు వెళ్లి విచారణ చేస్తే ఆల్బర్ట్ ఫిష్ అనే వ్యక్తి రూమ్ ఖాళీ చేసి కొద్దిరోజుల క్రితం వెళ్ళిపోయినట్టు తెలిసింది. పోలీసులు ఇంటి యజమాని దగ్గర తెలివిగా "ఒక చెక్కు ఉందని దాన్ని  క్లెయిమ్ చేసుకోవడానికి అతనిని సంప్రదించాలి" అని చెప్పారు. ఆమె అది నమ్మి ఆల్బర్ట్ ఫిష్ కు సమాచారం ఇచ్చింది. అదే ఆల్బర్ట్ ఫిష్ అక్కడికి రావడానికి, పోలీసులు అతడిని పట్టుకోవడానికి  కారణమైంది.


పోలీసుల దర్యాప్తులో గ్రేస్ బడ్ ను చంపినట్టు ఆల్బర్ట్ ఫిష్ అంగీకరించాడు. అతను అంతకుముందు చాలా మంది పిల్లలను చంపినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ముగ్గురిని మాత్రమే చంపినట్టు అతను ఒప్పుకున్నాడు. మరో తొమ్మిదిమంది విషయంలో అతని మీద అనుమానాలున్నాయి. కానీ ఆయా పిల్లల కుటుంబ సభ్యుల వద్ద నుంచి అతడిపై నేరారోపణలు రాలేదు. కేవలం గ్రేస్ బడ్ తల్లిదండ్రులు, వారి కుటుంబం మాత్రమే ఆల్బర్ట్ ఫిష్ మీద స్పష్టమైన ఆధారాన్ని చూపించగలిగింది. 


ఆల్బర్ట్ ఫిష్‌పై విచారణ మార్చ్ 11, 1935 లో ప్రారంభమై కేవలం కొన్ని నెలల కాలంలోనే మరణశిక్షగా తీర్మానిస్తూ తీర్పు వెలువడింది. 1936వ సంవత్సరం జనవరి 16వ తారీఖున సింగ్ సింగ్ జైలులో విద్యుదాఘాతం ద్వారా ఆల్బర్ట్ ఫిష్‌కు మరణశిక్ష విధించారు. అయితే బాధిత కుటుంబాలు ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాయి. మరొక ముఖ్యవిషయం ఏమిటంటే ఆల్బర్ట్ ఫిష్ తను రాసిన చివరి ప్రకటనను అతని న్యాయవాది బయటపెట్టలేదు. "గ్రేస్ బడ్ కుటుంబానికి రాసిన లేఖ ఆల్బర్ట్ ఫిష్ చివరి ప్రకటన ముందు చాలా చిన్నది. అతని చివరి ప్రకటనలో చాలా అశ్లీలత, అమానుష విషయలున్నాయి" అని ఆల్బర్ట్ ఫిష్ న్యాయవాది జేమ్స్ డెంప్సే వెల్లడించడం గమనార్హం. 


ఇదీ.. 86 ఏళ్ల క్రితం అమెరికన్ల వెన్నులో వణుకు పుట్టించిన ఆల్బర్ట్ ఫిష్ గురించిన కథ. అతడు ఎంత మందిని చంపినా.. ఎన్ని నేరాలు చేసినా ఎవరికీ ఇలా లేఖను రాయలేదు కానీ.. గ్రేస్ బడ్ విషయంలో మాత్రం పొరపాటు చేశాడు. ఎందుకు రాశాడో ఏమో కానీ.. ఆ లేఖ వల్లే అతడి దారుణాలు బయటపడ్డాయి. మనుషుల మాంసాన్ని భక్షించే నరరూప రాక్షసుడి గురించి దారుణ నిజాలు తెలిసేలా చేశాయి. చివరకు ఆ లేఖే అతడి మరణశిక్షకు దారితీసింది. ఇలాంటి వాళ్లు ఇప్పటికీ ఈ సమాజంలో అప్పుడప్పుడూ తారసపడుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్లు అసలు ఇలా మారడానికి వాళ్లు ఎంత కారణమో.. పెరిగిన పరిస్థితులు ఎంత కారణమో.. సమాజం కూడా అంతే కారణమని చెప్పక తప్పదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. 

Updated Date - 2022-08-14T16:55:23+05:30 IST