గుర్తు తెలియని కాల్స్‌ వస్తున్నాయా?

ABN , First Publish Date - 2020-05-30T09:55:36+05:30 IST

‘స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ కార్యాలయం నుండి మాట్లాడుతున్నాం’ అంటూ ఎవరైనా ఫోన్‌ చేస్తున్నారా? అయితే మీరు సైబర్‌ నేరస్థుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ తరహాలో ఫోన్‌ చేసి

గుర్తు తెలియని కాల్స్‌ వస్తున్నాయా?

అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ ఫక్కీరప్ప 


కర్నూలు, మే 29: ‘స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ కార్యాలయం నుండి మాట్లాడుతున్నాం’ అంటూ ఎవరైనా ఫోన్‌ చేస్తున్నారా? అయితే మీరు సైబర్‌ నేరస్థుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ తరహాలో ఫోన్‌ చేసి మీపై కేసు ఫైల్‌ చేస్తున్నామని, మిమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉందని, అలా కాకుండా ఉండాలంటే కొంత మొత్తాన్ని తమ అకౌంటులో జమ చేయాలని అంటారు. సాధారణంగా ఇలాంటి ఫోన్‌ రాగానే చాలా మంది కంగారు పడతారు. వాళ్లు అడిగినంత డబ్బు వాళ్ల అకౌంటులో వేస్తారు. ఇదంతా మోసమని తర్వాత తెలుస్తుంది. కోడుమూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసపోయాడు. అడిగినంత డబ్బు వారి అకౌంటులో వేశాడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫోను రావడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అపరిచితుల ఫోన్‌ కాల్స్‌ నమ్మకూడదన్నారు. మీ పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు. మీ వ్యక్తిగత వివరాలు, మీకు వచ్చిన ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి మీ వివరాలను అడిగినప్పుడు మీ దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100ను సంప్రదించాలి. 


అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ ఫక్కీరప్ప

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైబర్‌ నేరస్థులు వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని సైబర్‌ నేరస్థుల వల వేస్తున్నారు. అపరిచిత కాల్స్‌ వస్తే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

Updated Date - 2020-05-30T09:55:36+05:30 IST