యూనివర్సిటీ ఆవరణ జలమయం

ABN , First Publish Date - 2020-08-07T10:07:45+05:30 IST

కృష్ణా యూనివర్సిటీకి కష్టాలు తప్పడం లేదు. నూతన భవనాలు సమకూరినా యూనివర్సిటీ ఆవరణ చుట్టూ నీళ్లు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీకి 102.50 ఎకరాల భూమి ..

యూనివర్సిటీ ఆవరణ జలమయం

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి కష్టాలు తప్పడం లేదు.  నూతన భవనాలు సమకూరినా  యూనివర్సిటీ ఆవరణ చుట్టూ నీళ్లు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీకి 102.50 ఎకరాల భూమి రుద్రవరం పంచాయతీ పరిధిలో కేటాయించారు. రూ.80 కోట్ల వ్యయంతో నూతన భవనాలను నిర్మించారు. ఖాళీ స్థలాన్ని మెరక చేయకపోవడంతో వర్షపునీరు నిలిచి యూనివర్సిటీ జలదిగ్బంధంలో ఉంది. యూనివర్సిటీ సమీపంలోని రహదారి పూర్తిగా దెబ్బతింది. యూనివర్సిటీ పరిసరాలను మెరకచేయడంతో పాటు రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-08-07T10:07:45+05:30 IST