యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి

ABN , First Publish Date - 2022-06-29T05:44:21+05:30 IST

యూని వ ర్సిటీలకు స్వయంప్రతిపత్తిని కొనసాగించాలని ఏబీవీ పీ పాలమూరు యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు గోరంట్ల మహేశ్‌ డిమాండ్‌ చేశారు.

యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి
పీయూ గేట్‌ ఎదుట సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఏబీవీపీ నాయకులు

- ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

పాలమూరు యూనివర్సిటీ, జూన్‌ 28 :యూని వ ర్సిటీలకు స్వయంప్రతిపత్తిని కొనసాగించాలని ఏబీవీ పీ పాలమూరు యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు గోరంట్ల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకే కామన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డుని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసి స్తూ పీయూ మెయిన్‌గేట్‌ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇన్‌చార్జి హరికృష్ణ, శ్రీకాంత్‌, అజయ్‌బాబు, ఉపేంద్ర, అశోక్‌, శోభన్‌, జయరాం, చంద్రశేఖర్‌, శరత్‌, శివ, శివప్రసాద్‌, నరేశ్‌, సతీష్‌, చాణక్య ఉన్నారు.


ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

- వీసీకి వినతి పత్రం ఇచ్చిన అధ్యాపకులు 


పాలమూరుయూనివర్సిటీ, జూన్‌ 28 : పాలమూరు యూనివర్సిటీలో ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పాలమూరుయూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. బోధనతో పాటు యూనివర్సిటీలో దశాబ్దాలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తమ సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు సహకరించాలని వారు వీసీని కోరారు. ఈ కార్యక్రమంలో పుటా అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య, రవికుమార్‌, డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌, శ్రీలత, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ శ్రీనివాస్‌, రామ్మోహన్‌, సామేశ్వర్‌, ఈశ్వర్‌, ఇతర ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:44:21+05:30 IST