విశ్వసౌందర్యం

ABN , First Publish Date - 2021-05-19T05:30:00+05:30 IST

సౌందర్యరాశులందరూ ఒక్కచోటికి చేరిన వేళ... నిండు చందమామలా మెరిసి వేదికకు సరికొత్త అందాలనద్దింది ఆండ్రియా మెజా. ఇరవై ఆరేళ్ల ఈ మెక్సికో భామ ‘విశ్వసుందరి’గా అవతరించే క్రమంలో విభిన్న స్టయిల్స్‌ను ఆవిష్కరించింది

విశ్వసౌందర్యం

సౌందర్యరాశులందరూ ఒక్కచోటికి చేరిన వేళ... నిండు చందమామలా మెరిసి వేదికకు సరికొత్త అందాలనద్దింది ఆండ్రియా మెజా. ఇరవై ఆరేళ్ల ఈ మెక్సికో భామ ‘విశ్వసుందరి’గా అవతరించే క్రమంలో విభిన్న స్టయిల్స్‌ను ఆవిష్కరించింది. ఫైనల్‌ రౌండ్‌ కోసం రెడ్‌ సెక్విన్‌ డ్రెస్‌లో రోజా పువ్వులా విరిసిన ఆండ్రియా... అంతకుముందు జరిగిన వెల్కమ్‌ సెర్మనీలో టై-హై స్లిట్‌ గోల్డెన్‌ గౌన్‌ ధరించి అహో అనిపించింది. ‘ఇది కేసినో టైమ్‌’ అంటూ మరొక సందర్భంలో బ్రైట్‌ బ్లూ సింగిల్‌ పీస్‌ అవుట్‌ఫిట్‌లో చమక్కుమంది. వాలుకళ్ల వయ్యారం... సన్నజాజి సోయగం... పాలరాతి శిల్పాన్ని తలపించే రూపం... బహుశా అందుకేనేమో ఆమెకు ‘విశ్వసుందరి’ కిరీటం!

Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST