డిసెంబరులో ఏకతాటిపైకి: కాంగ్రెస్‌ పంచాంగం

ABN , First Publish Date - 2022-04-03T07:50:16+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన లక్ష్య సాధనలో ముందుకు

డిసెంబరులో ఏకతాటిపైకి: కాంగ్రెస్‌ పంచాంగం

  • రేవంత్‌ ప్రకంపనలు
  • లక్ష్యసాధనలో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు..
  • అక్టోబరు-డిసెంబరులో అందర్నీ ఒక తాటిపైకి తెస్తారు
  • పంచాంగ పఠన కర్త  శ్రీనివాస్‌ మూర్తి
  •  90 సీట్లు మనవే: రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన లక్ష్య సాధనలో ముందుకు వెళ్లడానికి గతంలో కంటే ఎక్కువ ధైర్యసాహసాలను ఈ ఏడాది ప్రదర్శించాల్సి ఉంటుందని, ప్రదర్శిస్తారు కూడా అని వేద పండితుడు చిలుకూరు శ్రీనివాస మూర్తి చెప్పారు. రానున్న అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో రేవంత్‌రెడ్డి అసలు స్వరూపాన్ని బయటకి తీస్తారని, రాష్ట్రంలో విపక్షం విరాజిల్లే విధంగా ఆయన ప్రకంపనలు రేపుతారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రాశి, పేరుబలం ప్రకారం అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో ఆయన ప్రదర్శన అందర్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చే విధంగా ఉంటుందన్నారు. ఉన్న త ఆశయ సాధన కోసం పీసీసీ అధ్యక్షుడికి చేదోడు, వాదోడుగా ఉండాలంటూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు సూచన చేశారు.  ఇందిరా భవన్‌లో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.


ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్‌, మల్లు రవి, హర్కార వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాం గ పారాయణం చేశారు. అందరికీ రాజయోగం కావాలంటే కష్టమేనని, రాజుకు సేవానిరతితో సేవ చేసుకుంటే, రాజే గుర్తించి పదవీ యోగం కట్టబెడతారని శ్రీనివాస మూర్తి పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మంచి ఆర్థికాభివృద్ధిని కలిగివుంటుందని, కేంద్ర ఆర్థిక అభివృద్ధి కూడా సంతృప్తికరంగానే ఉంటుందన్నారు. మంచి వర్షాలు కురుస్తాయని, పంట లు పండుతాయని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం అనేక విషయాల్లో వెనుకంజలోనే ఉంటుందన్నారు. కేంద్రంలో ఓ ముఖ్యనేత మరణ వార్త వింటామని ఆయన చెప్పారు. 


ఇందిరమ్మ రాజ్యం తేవాలి: రేవంత్‌ 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 80 లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు కాంగ్రె్‌సవేనని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్తపైనా ఉంద ని చెప్పారు. ఓ మహిళా నాయకత్వంలో సాధించుకు న్న తెలంగాణలో మహిళలకు రక్షణ, గౌరవం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో మహిళల పాత్రను గుర్తించి సముచిత అవకాశాలు కల్పించడానికి కలిసికట్టుగా ముందుకు వెళదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-03T07:50:16+05:30 IST