Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 13:27PM

పాక్, చైనాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్ : ఆందోళనకర స్థాయిలో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్న దేశాల జాబితాలోకి పాకిస్థాన్, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్‌లను అమెరికా చేర్చింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించే, ప్రస్తుతం జరుగుతున్న ఉల్లంఘనలను సహించే, అటువంటి చర్యల్లో పాలుపంచుకునే దేశాల జాబితాలోకి మయన్మార్, చైనా, ఎరిట్రియా, ఇరాన్, ది డీపీఆర్‌కే, పాకిస్థాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లను చేర్చుతున్నట్లు తెలిపారు. 


అల్జీరియా, కొమొరోస్, క్యూబా, నకరాగువా దేశాల్లోని ప్రభుత్వాలు తీవ్రమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలను సహిస్తున్నాయని, లేదా పాల్పడుతున్నాయని, ఈ దేశాలను స్పెషల్ వాచ్ లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పారు. 


అల్ షబాబ్, బోకో హరామ్, హయత్ తహ్రిర్ అల్ షామ్, హౌతీస్, ఐసిస్, ఐసిస్ గ్రేటర్ సహారా, ఐసిస్ వెస్ట్ ఆఫ్రికా, జమాత్ నస్ర్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్, తాలిబన్ సంస్థలను ప్రధాన ఆందోళనకర సంస్థల జాబితాలో పెడుతున్నట్లు తెలిపారు. 


ప్రతి దేశంలోనూ మత స్వేచ్ఛ ఉండాలని అమెరికా కోరుకుంటోందన్నారు. మత స్వేచ్ఛను ప్రోత్సహించడం నుంచి వెనుకడుగు వేసేది లేదన్నారు.


Advertisement
Advertisement