దేశ సంపద కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలే మార్గం

ABN , First Publish Date - 2021-10-26T03:18:02+05:30 IST

దేశ సంపదను కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలే మార్గమని, లంచాలు తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టడం దుర్గార్మమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారా యణ పేర్కొన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావే శంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై పోరాటాలకు సిద్ధంకావాలన్నారు.

దేశ సంపద కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలే మార్గం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 25: దేశ సంపదను కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలే మార్గమని, లంచాలు తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టడం దుర్గార్మమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారా యణ పేర్కొన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావే శంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై పోరాటాలకు సిద్ధంకావాలన్నారు. యేటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఏడున్నరేండ్లలో నిరుద్యోగుల సంఖ్యను పెంచి నిరంకుశ పాలన కొనసాగిస్తు న్నారని విమర్శించారు. మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ చేసిన వ్యాఖ్య లను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలన్నారు.  వ్యవ సాయ చట్టాలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌, పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఆలీఖాన్‌, రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-26T03:18:02+05:30 IST