ఎక్కడైనా పెళ్లయ్యాకే ముద్దు ముచ్చట... కానీ అక్కడ ఏం చేస్తారంటే..

ABN , First Publish Date - 2022-06-19T17:49:39+05:30 IST

జార్ఖండ్‌లో గిరిజనుల వివాహాలకు సంబంధించి...

ఎక్కడైనా పెళ్లయ్యాకే ముద్దు ముచ్చట... కానీ అక్కడ ఏం చేస్తారంటే..

జార్ఖండ్‌లో గిరిజనుల వివాహాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ధుకు ఆచారం ఒకటి. అమ్మాయి లేదా అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే వారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారు. కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరిస్తే, వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వారు సహజీవనం చేస్తారు. దీనినే ధుకు అంటారు. ఇలాంటి జంటలు పిల్లలు పుట్టాక ఊరు విడిచి కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో ఉండి, తిరిగి స్వగ్రామానికి చేరుకుంటారు. అప్పుడు వారు తమ వివాహానికి సామాజిక గుర్తింపు కోసం గ్రామ పెద్దల దగ్గరకు వెళ్తారు. 


పంచాయతీ సభ్యులు వారికి జరిమానా విధిస్తారు. అది చెల్లించాక వారు వివాహం చేసుకుంటారు. తద్వారా వారు వారి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కించుకునే అవకాశం పొందుతారు. సాధారణంగా ధుకు జంటకు నామమాత్రపు జరిమానా విధిస్తారు. గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేయడానికి మేకలను జరిమానాగా చెల్లించుకోవాలి.  ఈ విషయంలో మధ్యవర్తులు ఆ దంపతుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. రాజస్థాన్, గుజరాత్‌లోని గరాసియా తెగలలో కూడా యూవతీయువకులు ఈ విధంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు.  అయితే ఈ తెగలో వివాహం తప్పనిసరికాదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సహజీవనం చేసేవారు 50 లేదా 60 ఏళ్లు వచ్చాక కూడా వివాహం చేసుకోవచ్చు.

Updated Date - 2022-06-19T17:49:39+05:30 IST